Film: ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య..

ఏమైందో ఏమో తెలియట్లేదు కానీ సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతున్నాయి. అయితే యాక్సిడెంట్లు.. లేదంటే ఆత్మహత్యలు. వరుసగా ఇండస్ట్రీ స్టార్స్‌ను కోల్పోతోంది. ఇప్పుడు భోజ్‌పూరీ యాక్టర్‌ ఆకాంక్ష దుబే సూసైడ్‌ చేసుకుంది. వారణాసిలో ఆమె ఉంటున్న హోటల్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 26, 2023 | 08:00 PMLast Updated on: Mar 26, 2023 | 8:00 PM

Bhojpuri Film Actress Suicide

మార్నింగ్‌ నుంచి ఆమె బయటికి రాకపోవడంతో.. హోటల్‌ స్టాఫ్‌ డోర్‌ బద్దలుకొట్టి చూశారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న ఆమె శవం కనిపించింది. అయితే ఆకాంక్ష సూసైడ్‌కు కారణాలు మాత్రం ఇప్పటికీ తెలియలేదు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా చంపేశారా అని పోలీసులు అనుమానిస్తున్నారు. సినిమా షూటింగ్‌ కోసం వారణాసి వెళ్లిన ఆకాంక్ష.. షూటింగ్‌ కంటిన్యూ అవుతుండగానే సూసైడ్‌ చేసుకుంది. ఎలాంటి సూసైడ్‌ నోట్‌ కూడా ఆమె రూమ్‌లో దొరకలేదు.

దానికి తోడు.. ముందు రోజు కూడా ఆకాంక్ష షూటింగ్‌లో బాగానే ఉందని కో యాక్టర్స్‌ చెప్తున్నారు. చనిపోవడానికి కొన్ని గంటల ముందు కూడా ఇన్‌స్టాగ్రామ్లో ఓ వీడియో పోస్ట్‌ చేసింది ఆకాంక్ష. పవన్‌సింగ్‌తో ఆమె కలిసి చేసిన ఓ సాంగ్‌ను రీల్‌ చేసి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. కొన్ని గంటల ముందు కూడా బాగానే ఉన్న ఆమె.. సడెన్‌గా ఎందుకు సూసైడ్‌ చేసుకుంది అనేది సస్సెన్స్‌గా మారింది. ప్రస్తుతం రూమ్‌లో దొరికిన ఎవిడెన్స్‌లతో ఇన్వెస్టిగేషన్‌ స్టార్ట్‌ చేశారు పోలీసులు. ఆకాంక్ష తానే సూసైడ్‌ చేసుకుందా.. లేక ఎవరైనా చంపేసి సూసైడ్‌గా క్రియేట్ చేస్తున్నారా తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు.