Elvish Yadav: రేవ్ పార్టీలో పాము విషం.. బిగ్‌బాస్ ఓటీటీ విన్నర్‌‌పై కేసు..

సోషల్ మీడియా ఇన్‌‌ఫ్లుయెన్సర్‌‌గా కూడా పాపులర్ అయ్యాడు. అయితే, తాజాగా అతడు రేవ్ పార్టీలో మత్తు కోసం పాము విషం వాడినట్లు ఆరోపణలొచ్చాయి. ఎల్విష్ ఒక చేత్తో పామును పట్టుకుని ఆడుతున్న వీడియో కూడా బయటకు వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 3, 2023 | 03:20 PMLast Updated on: Nov 03, 2023 | 6:46 PM

Big Boss Winner And Youtuber Elvish Yadav Booked For Alleged Involvement In Snake Infused Rave Parties

Elvish Yadav: పాము విషంతో రేవ్ పార్టీ చేసుకున్న హిందీ బిగ్‌బాస్‌ (bigg boss) (ఓటీటీ) సీజన్-2 విన్నర్‌ ఎల్విష్ యాదవ్‌ (Elvish Yadav)పై నోయిడా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు అతడికోసం గాలిస్తుండగా, ఎల్విష్ పరారీలో ఉన్నాడు. ఎల్విష్ యాదవ్ బిగ్‌బాస్‌లో విజేతగా నిలిచి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సోషల్ మీడియా ఇన్‌‌ఫ్లుయెన్సర్‌‌గా కూడా పాపులర్ అయ్యాడు. అయితే, తాజాగా అతడు రేవ్ పార్టీలో మత్తు కోసం పాము విషం వాడినట్లు ఆరోపణలొచ్చాయి. ఎల్విష్ ఒక చేత్తో పామును పట్టుకుని ఆడుతున్న వీడియో కూడా బయటకు వచ్చింది.

Kasani Gnaneshwar: బీఆర్ఎస్‌లోకి కాసాని జ్ఞానేశ్వర్‌.. అక్కడి నుంచి పోటీ..

గురువారం సాయంత్రం నోయిడా సెక్టార్ 49లో జరుగుతున్న ఒక రేవ్ పార్టీ (rave party)పై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పార్టీలో పాల్గొన్న ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి నుంచి కొన్ని పాములను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిలో త్రాచు పాములు, కొండ చిలువ, రెండు తలల పాము, ర్యాటిల్ స్నేక్ ఉన్నాయి. అలాగే 20 మిల్లీ లీటర్ల పాము విషాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులతోపాటు ఈ అంశంతో సంబంధం ఉన్న ఎల్విష్‌ యాదవ్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టైన నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎల్విష్ పేరును ఎఫ్ఐఆర్‌‌లో చేర్చారు. ఎల్విష్ తరచూ రేవ్ పార్టీలు నిర్వహిస్తుంటాడని, ఆ పార్టీలకు తాము తరచూ పాములను సరఫరా చేస్తుంటామని నిందితులు పోలీసులకు చెప్పారు.

REVANTH REDDY: ధరణిని రద్దు చేస్తామంటే కేసీఆర్‌కు ఎందుకంత దుఃఖం: రేవంత్ రెడ్డి

పాములను ఇచ్చినందుకుగాను భారీగా డబ్బు వసూలు చేస్తామన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎల్విష్ కోసం వెతుకుతున్నారు. విషయం తెలియడంతో అతడు పరారీలో ఉన్నాడు. ఈ అంశంపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మాలివాల్ స్పందించారు. ఎల్విష్‌తో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఉన్న ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలాంటి వారిని సీఎం ప్రమోట్ చేయడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.