Sangareddy Fire Accident: కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు.. ఏడుగురు మృతి
బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. క్షతగాత్రులను గుర్తించి ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా మంటలు అదుపులోకి రాకపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Sangareddy Fire Accident: సంగారెడ్డి జిల్లా, హత్నూర మండలం చందాపూర్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు జరగడంతో మంటలు చెలరేగి ఏడుగురు మరణించారు. వీరిలో కార్మికులతోపాటు పరిశ్రమ డైరెక్టర్ రవి కూడా ఉన్నారు. మరికొందరు గాయపడ్డారు. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు.
KTR: మాస్ వార్నింగ్.. హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..!
క్షతగాత్రులను గుర్తించి ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా మంటలు అదుపులోకి రాకపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 50 మంది కార్మికులు ఉన్నారని తెలుస్తోంది. మంటల్లో కొందరు కార్మికులు చిక్కుకుపోయారు. సహాయం కోసం అర్థించారు. కొందరికి తీవ్ర గాయాలు కావడం, మంటలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. కెమికల్ ఫ్యాక్టరీలో విధులు నిర్వర్తిస్తుండగా.. రియాక్టర్ ఒక్కసారిగా పేలి మంటలు వ్యాపించారు. ఐదు వందల మీటర్ల దూరం వరకు ఫ్యాక్టరీకి సంబంధించిన శిథిలాలు ఎగిరిసిపడ్డాయి. మంటలు పెద్దఎత్తున ఎగిసిపడ్డాయని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో కార్మికులు బయటకు రాలేకపోయారని అంటున్నారు.
మంటలు పక్కనున్న మరో పరిశ్రమకు వ్యాపిస్తున్నాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో స్థానికుల్ని అధికారులు ఖాళీ చేయించారు. ఘటనాస్థలాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి చేరుకుని పరిశీలించారు. అలాగే సంగారెడ్డి ఎస్పీ రూపేశ్, డీఎస్పీ రవీందర్ రెడ్డి, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఘటనా స్థలాన్ని పరిశీలించి, సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు.