Bodhan ex-MLA Shakeel: దొంగ పోలీస్.. షకీల్ కొడుకు హిట్ అండ్ రన్ కేసులో సీఐ అరెస్ట్..
బోదన్ సీఐగా పని చేస్తున్న ప్రేమ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ప్రేమ్ కుమార్‌తో పాటు మరో వ్యక్తిని కూడా పంజాగుట్ట పోలీసులు విచారణ నిమిత్తం బయటికి తీసుకువెళ్లారు. ఈ యాక్సిడెంట్‌కు సంబంధించిన కీలక విషయాలు ప్రేమ్‌కుమార్‌కు తెలుసని చెప్తున్నారు పోలీసులు.
Bodhan ex-MLA Shakeel: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రహీల్ దుబాయ్ పారిపోయేందుకు సహకరించిన సీఐని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోదన్ సీఐగా పని చేస్తున్న ప్రేమ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ప్రేమ్ కుమార్‌తో పాటు మరో వ్యక్తిని కూడా పంజాగుట్ట పోలీసులు విచారణ నిమిత్తం బయటికి తీసుకువెళ్లారు. ఈ యాక్సిడెంట్‌కు సంబంధించిన కీలక విషయాలు ప్రేమ్‌కుమార్‌కు తెలుసని చెప్తున్నారు పోలీసులు.
CHANDRABABU NAIDU: జగన్ అర్జునుడు కాదు.. భస్మాసురుడు.. ఏపీని నెంబర్ వన్ చేస్తా: చంద్రబాబు
ప్రేమ్ కుమార్ విచారణ తరువాత చాలా విషయాలు బయటికి వచ్చే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. ప్రజాభవన్ ముందు తన స్నేహితులతో కలిసి కారుతో బీభత్సం సృష్టించాడు షకీల్ కొడుకు రహీల్. దీంతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. కొడుకును కేస్ నుంచి బయట పడేసేందుకు కారు నడిపింది డ్రైవర్ అని నమ్మించడానికి ప్రయత్నించాడు షకీల్. పోలీసులు కూడా మొదట డ్రైవర్‌ను మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. కానీ అసలు విషయంలో బయటికి రావడంతో పోలీసులపై యాక్షన్ తీసుకోవడంతో పాటు రహీల్‌ను అరెస్ట్ చేయాలని ఆదేశించిచారు పోలీసు ఉన్నతాధికారులు. దీంతో కొడుకును జైలుకు వెళ్లకుండా కాపాడుకునేందుకు అప్పటికప్పుడు రహీల్‌ను దుబాయ్‌కి పంపించాడు షకీల్. దీంతో పోలీసులు రహీల్‌కు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రహీల్ దుబాయ్ పారిపోయేందుకు సహకరించిన వ్యక్తులను వెతకడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే పది మంది వ్యక్తులు రహీల్‌కు సహకరించినట్టు గుర్తించారు.
మాజీ ఎమ్మెల్యే షకీల్‌తో సహా పది మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇందులో ఇద్దరు వ్యక్తులను ఇప్పటికే అరెస్ట్ కూడా చేశారు. మిగిలినవాళ్లు పరారీలో ఉన్నారు. బోదన్ సీఐగా పని చేస్తున్న ప్రేమ్ కుమార్ కూడా రహీల్‌కు సహకరించినట్టు రీసెంట్‌గా విచారణలో తేలడంతో వెంటనే ప్రేమ్ కుమార్‌ను కూడా అరెస్ట్ చేశారు. మొదట పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ప్రేమ్ కుమార్‌ను విచారించారు. కాసేపు విచారణ జరిపిన తరువాత.. ప్రేమ్ కుమార్‌తో పాటు మరో వ్యక్తిని తీసుకుని బయటికి వెళ్లారు. ప్రేమ్ కుమార్ విచారణ ముగిసిన తరువాత రహీల్‌కు సహకరించిన మరికొందరు పేర్లు కూడా బయటికి వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు పోలీసులు.