Bomb Blast: తెలివి తక్కువ పని.. 2 లక్షల కోసం ఎవడైనా బాంబు పెడతాడారా..!
అది మధ్యాహ్నం 2 గంటలు.. కొత్త షర్ట్ వేసుకొని ఒకడు బ్యాంక్‌లోకి వచ్చాడు. బటన్స్ విప్పాడు.. మానవబాంబునంటూ బిల్డప్ ఇచ్చాడు. రెండు లక్షలు ఇవ్వకపోతే పేల్చుకుంటా.. చచ్చిపోతా అని బెదిరించాడు.
రెండు లక్షలకు ఇంత సాహసం ఎందుకు.. వీడేం వెధవ అనుకున్నారు అంతా ! కట్ చేస్తే.. వాడు ఫేక్.. బాంబ్ ఫేక్.. హైదరాబాద్ శివారుల్లోని జీడిమెట్లలో జరిగిందీ ఘటన. జీడిమెట్ల పీఎస్ పరిధిలోని ఆదర్శ్ బ్యాంక్‌లో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. బ్యాంకులోకి చొరబడి తాను మానవ బాంబునంటూ బెదిరింపులకు దిగాడు. అందుకు తగ్గట్లుగానే తన ఒంటికి ఓ బాంబ్ సెటప్ పెట్టుకుని వచ్చాడు. రెండు లక్షలు ఇవ్వకపోతే పేల్చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
దీంతో బ్యాంకులోని సిబ్బంది తొలుత ఆందోళన చెందారు. బాంబు సెటప్ డొల్ల అని కాసేపటికే తేలిపోయింది. దీంతో అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వెంటనే స్పాట్‌కు చేరుకున్న జీడిమెట్ల పోలీసులు బాంబుతో బెదిరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి పేరు శివాజీ అని గుర్తించారు. అతడు ఎందుకు అలా బిహేవ్ చేశాడు.
మతిస్థిమితం లేక అక్కడికి వచ్చాడా.. లేదా నిజంగానే డబ్బు దోచుకెళ్లేందుకు కుట్ర పన్నాడా.. అతడిని ఎవరైనా అతని బ్రెయిన్ వాష్ చేసి.. ఈ తరహా పని చేసేందుకు పురిగొల్పారా అనే వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఏమైనా మరీ రెండులక్షలకు ఇంత రిస్క్ ఏంట్రా బాబూ అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలుపెట్టారు నెటిజన్లు.