Mothers Day: తల్లిపై పోలీస్‌ కంప్లైంట్‌ ఇచ్చిన పదేళ్ల బాలుడు కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..

మదర్స్‌ డే అని కూడా చూడకుండా తల్లిపై ఫిర్యాదు చేసేందుకు వచ్చాడు ఓ బాలుడు. నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తన తల్లిపై కేస్‌ పెట్టాలంటూ పోలీసులను అడిగాడు. అంత కష్టం ఏమొచ్చిందిరా అని పోలీసులు అడిగిన ప్రశ్నకు ఆ బాలుడు చెప్పిన ఆన్సర్‌ అందరినీ షాక్‌కు గురి చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 15, 2023 | 12:59 PMLast Updated on: May 15, 2023 | 12:59 PM

Boy Complaint On Mother At Police Station

కంప్లైంట్ ఇచ్చిన బాబు పేరు సాయి దినేష్‌. వయసు పదేళ్లు. ఏలూరు జిల్లా కొత్తపేటలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటాడు. నిన్న తన ఫ్రెండ్‌ బర్త్‌ బే సెలబ్రేషన్‌కు వెళ్లేందుకు ఇంట్లో రెడీ అయ్యాడు. స్నానం చేసి వైట్‌ షర్ట్ ఇవ్వాలంటూ తల్లిని అడిగాడు. దానికి సాయిదినేష్‌ తల్లి ఒప్పుకోలేదు. వేరే షర్ట్‌ వేసుకోమని చెప్పింది. అయినా వినకుండా సాయి దినేష్‌ మారాం చేశాడు. దీంతో రెండు దెబ్బలు వేసింది.

తల్లిమీద కోపంతో రగిలిపోయిన సాయి నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు. జరిగిన విషయం మొత్తం చెప్పి తల్లిపై కేస్‌ పెట్టాలంటూ పోలీసులను కోరాడు. నవ్వాలా ఏడవాలో అర్థం కానీ పోలీసులు. సాయి దినేష్‌ తల్లిదండ్రులను పిలిపించారు. సాయిదినేష్‌కు ఇప్పుడున్న తల్లి సొంత తల్లి కాదు. ఆమె రెండు సంవత్సారల క్రితం చనిపోయింది. దీంతో సాయి దినేష్‌ తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి సవతి తల్లికి ఇద్దరు పిల్లలు సహించడంలేదని స్థానికులు చెప్తున్నారు. ప్రతీ విషయంలో వాళ్లను దూరం పెడుతూ కొడుతూ ఉంటుందని చెప్తున్నారు. విషయం మొత్తం కనుకున్న పోలీసులు సాయిదినేష్‌ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా వినాలంటూ బాలుడికి నచ్చజెప్పి పంపించారు. ఈ ఇష్యూ ఇప్పుడు ఏలూరులో హాట్‌ టాపిక్‌గా మారింది.