Lasya Nanditha: లాస్య పోస్ట్‌మార్టం రిపోర్టులో సంచలనాలు..

సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలో లాస్య నందిత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గతేడాది నందిత తండ్రి సాయన్న అంత్యక్రియలను మారేడ్‌పల్లిలో నిర్వహించారు. ఇక అటు లాస్య పార్థివదేహానికి పోస్టుమార్టం పూర్తయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 23, 2024 | 02:10 PMLast Updated on: Feb 23, 2024 | 2:10 PM

Brs Mla Lasya Nanditha Postmortem Report Revealed

Lasya Nanditha: యువ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో తెలంగాణ రాజకీయాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయ్. శుక్రవారం తెల్లవారుజామున ఓఆర్ఆర్ మీద జరిగిన ప్రమాదంలో లాస్య నందిత ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి నెల.. ఆ కుటుంబానికి అసలు కలిసిరావడం లేదు. గత ఏడాది ఇదే ఫిబ్రవరిలో లాస్య తండ్రి సాయన్న కూడా చనిపోయారు. ఐతే ఎంతో భవిష్యత్‌ ఉన్న లాస్య.. ఇలా చనిపోవడం ఆ కుటుంబంలోనే కాదు.. బీఆర్ఎస్‌ వర్గాల్లోనూ విషాదం నింపింది.

Lasya Nanditha: నలుగురితో కలిసి వెళ్తే.. ఇద్దరికే ప్రమాదం.. యాక్సిడెంట్‌‌కు ముందు అసలేం జరిగింది

సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలో లాస్య నందిత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గతేడాది నందిత తండ్రి సాయన్న అంత్యక్రియలను మారేడ్‌పల్లిలో నిర్వహించారు. ఇక అటు లాస్య పార్థివదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. అధికారులు ప్రాథమిక నివేదిక బయట పెట్టారు. ఈ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయ్. ప్రమాదంలో లాస్య నందిత ఎముకలు పూర్తిగా దెబ్బతిన్నాయ్. సీట్‌ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే లాస్య చనిపోయినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో క్లియర్‌గా బయటపడింది. లాస్య తలకు బలమైన గాయం అయిందని.. దాని కారణంగానే స్పాట్‌లోనే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. లాస్య కాలు కూడా ఒకటి పూర్తిగా విరిగిపోయినట్లు నివేదికలో తేల్చారు. థై బోన్‌, రిబ్స్ కూడా ఫ్రాక్చర్ అయిందని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. ప్రమాదం సమయంలో సీటు బెల్ట్ పెట్టుకొని ఉంటే.. పరిస్థితి ఇంకోలా ఉండేదని.. లాస్య బతికి ఉండేవారు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్.

సీటు బెల్ట్ ప్రాముఖ్యతపై ఇప్పుడు మళ్లీ చర్చ మొదలైంది. ఇక అటు అధికారిక లాంఛనాలతో లాస్య అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా సాగుతున్నాయ్. తండ్రి సమాధి పక్కనే.. లాస్య సమాధి కూడా నిర్మించాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. అటు లాస్య కుటుంబసభ్యులను పరామర్శించిన కేసీఆర్‌.. వారిని ఓదారుస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు.