Soumya Shetty: నువ్వు ఇక మారవా ? సౌమ్య శెట్టిపై మరోకేసు.. ఈసారి ఏం చేసిందంటే..

ఇంటర్వ్యూల్లో.. తాను నిజంగా దొంగతంనం చేయలేదని, కావాలనే ఈ కేసులో తనను ఇరికించారని చెప్పింది. తనను తాను సేవ్‌ చేసుకునేందుకు తన ఫ్రెండ్‌ మౌనికను దొంగను చేసింది. మౌనిక, ఆమె తండ్రి కావాలనే ఉద్దేశపూర్వకంగా తనను ఈ కేసులో ఇరికించారని, పోలీసులకు డబ్బులిచ్చి మేనేజ్‌ చేశారని చెప్పింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 24, 2024 | 02:58 PMLast Updated on: Mar 24, 2024 | 2:58 PM

Case Filed Against Actress Soumya Shetty Again Here Is The Detail

Soumya Shetty: యాక్టర్‌ సౌమ్య శెట్టి దొంగతనం కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంత వైరల్‌ అయ్యిందో సపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈజీగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో దొంగగా మారింది ఈ అమ్మాయి. మౌనిక అనే తన స్నేహితురాలి ఇంట్లోనే చోరీ చేసింది. బెయిల్‌ మీద బటయటకు వచ్చిన సౌమ్య మీద ఇప్పుడు మరో కేసు నమోదు చేశారు వైజాగ్‌ పోలీసులు. ఈ కేసులో సౌమ్య బెయిల్‌ మీద బయటకు వచ్చిన తరువాత కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది.

Emraan Hashmi: ఫ‌స్ట్ లుక్ రిలీజ్.. ఓజీ’ నుంచి మెంటలెక్కించే పోస్టర్

ఆ ఇంటర్వ్యూల్లో.. తాను నిజంగా దొంగతంనం చేయలేదని, కావాలనే ఈ కేసులో తనను ఇరికించారని చెప్పింది. తనను తాను సేవ్‌ చేసుకునేందుకు తన ఫ్రెండ్‌ మౌనికను దొంగను చేసింది. మౌనిక, ఆమె తండ్రి కావాలనే ఉద్దేశపూర్వకంగా తనను ఈ కేసులో ఇరికించారని, పోలీసులకు డబ్బులిచ్చి మేనేజ్‌ చేశారని చెప్పింది. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటి అంటే.. తానే ఈ దొంగతనం చేశాను అని సౌమ్య పోలీసుల ముందు ఒప్పుకుంది. కానీ ఇప్పుడు బయటికి వచ్చి మరో కొత్త స్టోరీ ఇటర్వ్యూల్లో చెప్తోంది. దీంతో మౌనిక తండ్రి మరోసారి సౌమ్యమీద పోలీస్‌ కంప్లైంట్‌ ఇచ్చాడు. తన ఇంట్లో చోరీ చేయడమే కాకుండా తన పరువు తీసేలా ఇంటర్వ్యూలు ఇస్తోందంటూ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో మౌనిక మీద పాత కేసుతో పాటు కొత్తగా మరో కేసు నమోదు చేశారు పోలీసులు.

ఫ్రెండ్ ఇంట్లో దొంగతనం చేయడమే పెద్ద చెండాలమైన విషయం అంటే.. అడ్డంగా దొరికి కూడా ఇప్పుడు ఆ తప్పు చేను చేయలేదు అని చెప్పడం మరో దారుణంగా తయారయ్యింది. ఇలాంటి ఇటర్వ్యూలతో తనకు సింపతీ వస్తుంది అనుకుందేమో కానీ.. సౌమ్య ఇంటర్వ్యూలు చూసిన ప్రతీ ఒక్కరూ కామెంట్‌ సెక్షన్‌లో వేసుకుంటున్నారు. చేసిదంతా చేసి ఇప్పుడు కబుర్లు చెప్తున్నావా అంటూ ఆడుకుంటున్నారు. మరి ఇప్పుడు కొత్తగా ఫైల్‌ ఐన ఈ కేసులో సౌమ్యపై పోలీసులు ఎలాంటి యాక్షన్‌ తీసుకుంటారో చూడాలి.