COUPLE CHAIN SNATCHING: చిట్టచివరికి పట్టేశారు.. పోలీసుల అదుపులో బంటీ ఔర్‌ బబ్లీ

నల్గొండ జిల్లా మర్రిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ మహిళ మెడలో చైన్‌ కొట్టేశారు స్నాచర్లు. కొట్టేసింది ఎవరో కాదు ఈ జంటే. అమ్మాయి అబ్బాయి కలిసి రావడంతో ఆ మహిళ వీళ్లు దొంగలు అని గుర్తించలేకపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 13, 2024 | 02:56 PMLast Updated on: Jan 13, 2024 | 5:11 PM

Chain Snatching Couple Arrested By Police In Hyderabad

COUPLE CHAIN SNATCHING: భార్యాభర్తలంటే జీవితకాల బంధం. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుండాలి. చావు వరకు కూడా కలిసే నడవాలి. ఇదే విషయాన్ని మరీ సీరియస్‌గా తీసుకుంది ఓ జంట. మంచిలో కలిసుంటే ఒకే.. కానీ క్రైమ్‌లో కూడా కలిసుండి.. ఇదెక్కడి సంతరా నాయనా అనేలా చేస్తోంది. నల్గొండ జిల్లా మర్రిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ మహిళ మెడలో చైన్‌ కొట్టేశారు స్నాచర్లు. కొట్టేసింది ఎవరో కాదు ఈ జంటే. అమ్మాయి అబ్బాయి కలిసి రావడంతో ఆ మహిళ వీళ్లు దొంగలు అని గుర్తించలేకపోయింది.

Janasena Target : జనసేన టార్గెట్ టెన్ వీళ్లే ! ఓడించి తీరాలని కసితో ఉన్నారు !!

వాళ్లను లిఫ్ట్‌ అడిగి అదే బైక్‌ మీద ఎక్కింది. కొంత దూరం వెళ్లిన తరువాత ఆ మహిళను స్కూటీ దింపి.. మెడలో చైన్‌ లాక్కొని వెళ్లిపోయారు వీళ్లిద్దరు. బాధిత మహిళ ఈ విషయాన్ని అక్కడే ఉన్న కొందరికి చెప్పడంతో వాళ్లు బైక్‌ మీద ఇద్దరు నిందితులను ఛేజ్‌ చేశారు. వీళ్లు బైక్‌ నడిపే స్పీడ్‌ చూస్తే ధూమ్‌ సినిమా వీళ్లతో తీసినా బాగుండు అనిపిస్తుంది. స్థానికులు ఎంత ట్రై చేసినా వీళ్ల స్పీడ్‌ ముందు ఓడిపోయారు. నిందితులిద్దరూ హైదరాబాద్‌కు పారిపోయారు. దీంతో వీళ్లను పట్టుకునేందుకు ప్రత్యేకంగా నాలుగు టీంలను ఏర్పాటు చేశారు పోలీసులు. సీసీ ఫుటేజ్‌ ఆధారాంగా సంతోష్‌నగర్‌లో నిందితులను అరెస్ట్‌ చేశారు. అప్పటి వరకూ వీళ్లిద్దరూ లవర్స్‌ అని అంతా అనుకున్నారు.

కానీ అరెస్ట్‌ అయ్యాక తెలిసింది వీళ్లిద్దరూ భార్యభర్తలని. చెడు వ్యసనాలకు బానిసలై ఈజీగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలను మార్గంగా పెట్టుకున్నారు నిందితులిద్దరూ. భర్త తప్పు చేస్తే మంచి చెప్పాల్సింది పోయి.. తాను కూడా చోరీలో భర్తకు చేదోడువాదోడుగా నిలిచింది అతడి భార్య. ఏదేమైనా ఇప్పుడు ఈ బంటీ ఔర్‌ బబ్లీ స్టోరీ హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఎవడు మంచోడు.. ఎవడు దొంగోడో కనిపెట్టలేని పొజిషన్‌లో ప్రజలు ఉంటే.. ఇప్పుడు కొత్తగా ఇలాంటి బ్యాచ్‌లు తయారవుతున్నాయి.