Chandoo Sai: చందుగాడు అరెస్ట్.. పెళ్లి చేసుకుంటానని మోసం..
నార్సింగ్‌కి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని చందు సాయి మోసం చేశాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని కేసు నమోదయింది. యూట్యూబ్‌లో చందుగాడుగా ఫేమస్ అయిన చందుసాయి అసలు పేరు.. చంద్రశేఖర్ సాయికిరణ్.
Chandoo Sai: పుష్ప మచ్చ ఘటన మర్చిపోకముందే.. మరో డిజిటల్ సెలబ్రిటీ అరెస్ట్ అయ్యాడు. ఒకప్పుడు పక్కింటి కుర్రాడుగా, ఇప్పుడు చందుగాడుగా ఫేమస్ అయిన ప్రముఖ యూట్యూబర్ చందుసాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. నార్సింగ్‌కి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని చందు సాయి మోసం చేశాడు.
Rajasthan CM, Bhajanlal Sharma : రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ.. అర్ధరాత్రి ప్రమాణ స్వీకారం..
ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని కేసు నమోదయింది. యూట్యూబ్‌లో చందుగాడుగా ఫేమస్ అయిన చందుసాయి అసలు పేరు.. చంద్రశేఖర్ సాయికిరణ్. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఒక యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారం, మోసం కింద చందు మీద కేసులు నమోదు చేశారు పోలీసులు. చందు.. 2021 ఏప్రిల్ 25న పుట్టినరోజు వేడుకలకు యువతిని పిలిచాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతనిపై 420, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. చంద్రశేఖర్‌తో పాటు అతని తల్లిదండ్రులు, మరో ఇద్దరిపై కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం అతన్ని రిమాండ్‌కు తరలించారు. చందుసాయి యూట్యూబ్లో చాలా పాపులర్.
చందూగాడు, పక్కింటి కుర్రాడు వంటి యూట్యూబ్ ఛానల్స్‌లో వీడియోలు చేసేవాడు. కామెడీ వీడియోల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు పని చేసే యూట్యూబ్ ఛానళ్లకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేవి. ఐతే ఇప్పుడ చందుసాయి అరెస్ట్‌తో ఒక్కసారిగా కలకలం రేగింది. వీడియోల ద్వారా మెసేజ్‌లు ఇస్తూ.. యువతను అట్రాక్ట్ చేసే చందుసాయి అసలు బాగోతం ఇదా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.