Cheddigang: తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్‌.. భయంతో వణికిపోతున్న స్థానికులు..

చెడ్డీ గ్యాంగ్ తిరుపతిలో అడుగుపెట్టింది. స్థానికంగా దోపిడీకి విఫలయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన సీసీ కెమరా విజువల్స్ కూడా బయటపడ్డాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 12, 2023 | 07:59 PMLast Updated on: Nov 12, 2023 | 8:01 PM

Cheddigang Halchal In Tirupati Police Alerted

Cheddigang: చెడ్డీ గ్యాంగ్ అంటే తెలియని వాళ్లుండరు. దోపిడీలు, దొంగతనాలకు పాల్పడటంలో వీళ్ల స్టైలే వేరు. చెడ్డీ వేసుకుని, ఇళ్లల్లోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతుంటారు. అవసరమైతే హత్యలకు కూడా వెనుకాడరు. వీళ్లకున్న నేర చరిత్ర అలాంటిది. అందుకే చెడ్డీ గ్యాంగ్ అంటే ప్రజలకు హడల్. పోలీసులకు సవాల్. వీళ్ల గురించి ఇప్పుడెందుకూ అంటే.. చెడ్డీ గ్యాంగ్ తిరుపతిలో అడుగుపెట్టింది. స్థానికంగా దోపిడీకి విఫలయత్నం చేసింది.

REVANTH REDDY: దాడుల పేరుతో బీఆర్ఎస్ డ్రామాలు.. హరీష్ రావుది సురభి నాటకం: రేవంత్ రెడ్డి

ఇందుకు సంబంధించిన సీసీ కెమరా విజువల్స్ కూడా బయటపడ్డాయి. ఇటీవల రాత్రి రేణిగుంట రోడ్డు, ఆటోనగర్ లోని మారూతి షో రూంలో, శనివారం రాత్రి శ్రీవారి విల్లాస్ లో చోరికి యత్నించారు. చెర్లోపల్లి వద్ద వున్న శ్రీవారి విల్లాస్ నెంబర్ 31లో చోరికి పాల్పడింది చెడ్డి గ్యాంగ్. ఊరి శివార్లలో వున్న ఇళ్లను టార్గెట్ చేస్తూన్న ఈ చెడ్డి గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడుతోంది. ఉదయం వేళలో రెక్కి నిర్వహించి, రాత్రి సమయాలలో చోరి చేస్తుంటారు. తిరుపతి శివారులో చెడ్డీగ్యాంగ్‌ సంచరిస్తుందన్న వార్తలతో స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. శివారు ప్రాంతంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల్లో ఈ గ్యాంగ్ సంచారం నమోదైంది.

దీంతో అప్రమత్తమైన పోలీసులు గస్తీని ముమ్మరం చేస్తున్నారు. చెడ్డీగ్యాంగ్ సంచారం గురించి తెలియడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ఈ గ్యాంగ్ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గ్యాంగును పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.