Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌ను అరెస్ట్‌ చేసిన థాయ్‌ పోలీసులు

హైదరాబాద్‌కు చెందిన క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్‌ను థాయ్‌లాండ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రవీణ్‌తో పాటు మరో 93 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ అయిన వారిలో 16 మంది మహిళలు కూడా ఉన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 1, 2023 | 02:02 PMLast Updated on: May 01, 2023 | 2:02 PM

Chikoti Praveen Arrest At Thailand

ప్రవీణ్‌ గ్యాంగ్‌ నుంచి భారీగా డబ్బు, గేమింగ్‌ చిప్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సుమారు 20 కోట్ల విలువ చేసే గేమింగ్‌ చిప్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అక్రమంగా క్యాసినో నిర్వహించడంతో ప్రవీణ్‌ను అరెస్ట్‌ చేసినట్టు సమాచారం. గతంలో గుడివాలో నిర్వహించిన క్యాసినో వ్యవహారంలో ప్రవీణ్‌ ప్రధాన నిందితుడు.

హైదరాబాద్‌ నుంచి సినీ, రాజకీయ ప్రముఖులను గోవా, శ్రీలంక, బ్యాంకాక్‌కు తీసుకువెళ్లి క్యాసినో ఆడించినట్టు ప్రవీణ్‌ మీద అభియోగాలున్నాయి. గతంలో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో క్యాసినో నిర్వహిస్తూ ప్రవీణ్‌ అరెస్ట్‌ అయ్యాడు. ఇతనిపై మనీలాండరింగ్‌ అభియోగాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ప్రవీణ్‌ను థాయ్‌ పోలీసులు అరెస్ట్‌ చేయడం సంచలనంగా మారింది.