Sun burn Event : సన్ బర్న్ ఈవెంట్ పై పోలీసుల సీరియస్ …!

తెలంగాణలో అనుమతి లేకుండా నిర్వహించే ఈవెంట్స్, భారీ ఫంక్షన్లపై పోలీసులు సీరియస్ గా వ్యవహరిస్తున్నారు.  పోలీసుల అనుమతులు, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా భారీ ఈవెంట్స్ నిర్వహించడం ఆ తర్వాత ఏదైనా అల్లర్లు జరిగితే అందుకు పోలీసులను బాధ్యులను చేయడం కామన్ గా మారింది.  అంతేకాదు న్యూఇయర్ ఈవెంట్స్ లో డ్రగ్స్ వాడుతున్నట్టు ఆరోపణలు కూడా వస్తున్నాయి. దాంతో ఇలాంటి షోలపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులు డిసైడ్ అయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 25, 2023 | 11:51 AMLast Updated on: Dec 25, 2023 | 11:51 AM

Cp Serious On Sun Burn Event No Drugs

న్యూ ఇయర్ కోసం హైదరాబాద్ లో భారీగా ఈవెంట్స్, ఫంక్షన్లు ఏర్పాటవుతున్నాయి.  పోలీసుల అనుమతి లేకుండా… కనీసం అప్లయ్ కూడా చేసుకోకుండానే భారీ ఈవెంట్స్ నిర్వహిస్తోంది సన్ బర్న్ సంస్థ.  గచ్చిబౌలి, మాదాపూర్ లాంటి ఏరియాల్లో గతంలో సన్ బర్న్ ఈవెంట్స్ చేసింది.  ఇప్పుడు కూడా  ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఈవెంట్స్ అనౌన్స్ చేసి… బుక్ మై షో ద్వారా ఆన్ లైన్లో భారీగా టిక్కెట్ల అమ్మకాలు మొదలుపెట్టింది. ఇలాంటి ఈవెంట్స్ పై  కఠినంగా వ్యవహరించాలని  పోలీసులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.  ఆదివారం నాడు సెక్రటేరియట్ లో జరిగిన IAS, IPSల సమావేశంలో సన్ బర్న్ లాంటి ఈవెంట్స్ పై చర్చకు వచ్చింది. న్యూఇయర్ ఈవెంట్స్ లో డ్రగ్స్ వాడకం ఎక్కువగా జరుగుతోందనీ… ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని సీఎం ఆదేశించారు. దాంతో ఈ ఈవెంట్ పై సీరియస్ అయ్యారు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి. సన్ బర్న్ కి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. అసలు ఇప్పటి వరకూ అనుమతుల కోసం దరఖాస్తు  కూడా చేసుకోలేదని స్పష్టం చేశారు.  అనుమతి లేకుండా టికెట్లు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. బుక్ మై షో ప్రతినిధులను పిలిచి హెచ్చరించామని చెప్పారు. న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం ఎవరైనా సరే…. అనుమతులు తీసుకోవాల్సిందే అన్నారు సీపీ అవినాష్ మహంతి.

Food poison in Rails: రైళల్లో బిర్యానీ తిని… 9 మంది అస్వస్థత !

హైదరాబాద్ సిటీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ పార్టీ ఈవెంట్స్ పై ఫోకస్ పెంచారు పోలీసులు.  సన్ బర్న్ లాంటి ఈవెంట్స్ లో డ్రగ్స్ వాడుతున్నారని గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. కానీ ఈసారి సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ సప్లయ్ పై సీరియస్ గా ఉన్నారు.  విద్యార్థులు, యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని సీఎం ఆదేశించారు.  అందుకే ఈసారి న్యూఇయర్ ఈవెంట్స్ పై పోలీసులు గట్టి నిఘా పెట్టారు.  ఎక్కడైనా డ్రగ్స్ వాడినట్టు తెలిస్తే … ఎంతటి వారైనా జైలుకు పంపాలని పోలీసులు భావిస్తున్నారు.