DHARANI SCHEME: ధరణిలో దొంగలు పడ్డారు.. చేతులు మారిన లక్షల రూపాయలు..!

కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులు గత రెండు నెలలుగా అసెంబ్లీ ఎన్నికల బిజీలో ఉన్నారు. ఈ టైమ్‌ని క్యాష్ చేసుకున్నారు ఇద్దరు ఉద్యోగులు. అక్టోబర్ 14 నుంచి నవంబర్ 11 మధ్య కాలంలో ఈ స్కామ్ జరిగింది. 28 రోజుల్లోనే నిషేధిత జాబితాలో ఉన్న 98 అప్లికేషన్లకు కలెక్టర్ డిజిటల్ సైన్‌తో ఆమోదం తెలిపారు ఇద్దరు ఉద్యోగులు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 8, 2023 | 02:37 PMLast Updated on: Dec 08, 2023 | 2:37 PM

Dharani Scheme Employees Cheated In Land Scam In Dharani

DHARANI SCHEME: అధికారులు అసెంబ్లీ ఎన్నికల హడావిడిలో ఉండటం చూసి ధరణి పోర్టల్‌లో భారీ భూభాగోతం బయటపడింది. రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ అనుమతి, గ్రౌండ్ లెవల్లో ఎంక్వైరీలు ఏవీ లేకుండా.. ఏకంగా 98 అప్లికేషన్లకు ఆమోదం తెలిపారు. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారాయి. దాంతో ఇద్దరు ఉద్యోగులపై వేటు వేసిన అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో దొంగలు పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో భారీ స్కామ్ బయటపడింది.

REVANTH REDDY: తూటాలా పేలిన పాట.. ఈ ఒక్క పాటే రేవంత్‌ను సీఎంని చేసింది..!

కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులు గత రెండు నెలలుగా అసెంబ్లీ ఎన్నికల బిజీలో ఉన్నారు. ఈ టైమ్‌ని క్యాష్ చేసుకున్నారు ఇద్దరు ఉద్యోగులు. అక్టోబర్ 14 నుంచి నవంబర్ 11 మధ్య కాలంలో ఈ స్కామ్ జరిగింది. 28 రోజుల్లోనే నిషేధిత జాబితాలో ఉన్న 98 అప్లికేషన్లకు కలెక్టర్ డిజిటల్ సైన్‌తో ఆమోదం తెలిపారు ఇద్దరు ఉద్యోగులు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు తెలుస్తోంది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా ఉండటంతో.. అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్‌పై ఈసీ వేటు వేసింది. ఆయన స్థానంలో భారతీ హోళీకేరి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆమె ఎన్నికల డ్యూటీలో బిజీ అయ్యారు. ధరణి పోర్టల్‌కి వస్తున్న అప్లికేషన్లను పట్టించుకోలేదు. ఇది గమనించిన కలెక్టరేట్ సిబ్బంది.. భూదాన్ భూములను పట్టా ల్యాండ్స్‌గా మారుస్తూ కలెక్టర్ డిజిటల్ సైన్‌తో ఆమోదించారు. ధరణి పోర్టల్‌కి వచ్చే ఇలాంటి అప్లికేషన్లను ఆమోదించాలన్నా.. తిరస్కరించాలన్నా కూడా రెవెన్యూ అధికారులు గ్రౌండ్ లెవల్లో ఎంక్వైరీ చేయాలి.

వాళ్ళు ఇచ్చిన రిపోర్టును బట్టే కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇవేమీ లేకుండా భూదాన్ భూములన్నీ.. ధరణిలోకి పట్టాభూములుగా ఎక్కాయి. పోలీసులకు ఫిర్యాదు అందడటంతో.. కంప్యూటర్ ఆపరేటర్, ధరణి కోఆర్డినేటర్‌పై ఎంక్వైరీ మొదలైంది. అయితే వీళ్ళిద్దరు కలిసే ఈ భారీ స్కామ్ చేశారా..? లేక ఇంకా ఎవరైనా ఉన్నతాధికారుల ప్రమేయం ఉందా అన్న దానిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.