Kalyan Krishna: డాక్టర్‌ను బలి తీసుకున్న సినీ డైరెక్టర్..? వైసీపీ నేత తమ్ముడి బాగోతమే కారణమా..?
రష్యాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన శ్రీకిరణ్.. కాకినాడ జీజీహెచ్ మార్చురీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆస్తి విషయంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు సోదరుడు కల్యాణ్‌కృష్ణతో ఆయనకు వివాదం ఉందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
Kalyan Krishna: సినీ దర్శకుడు కల్యాణ్ కృష్ణ వివాదంలో చిక్కుకున్నాడు. ఒక యువ డాక్టర్ ఆత్మహత్యలో ఆయన ప్రమేయం ఉందని తెలుస్తోంది. తాజాగా కాకినాడలో యువ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అశోక్‌నగర్‌కు చెందిన వైద్యుడు నున్న శ్రీ కిరణ్ చౌదరి.. గడ్డి మందు తాగాడు. కుటుంబసభ్యులు అతన్ని కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆస్తి విషయమై శ్రీకిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు అంటున్నారు. రష్యాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన శ్రీకిరణ్.. కాకినాడ జీజీహెచ్ మార్చురీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆస్తి విషయంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు సోదరుడు కల్యాణ్‌కృష్ణతో ఆయనకు వివాదం ఉందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
Revanth Reddy’s open letter : స్థానిక ప్రజాప్రతినిధులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
కల్యాణ్ కృష్ణ అనుచరుడు పెదబాబుతో పాటు.. వైసీపీ నేతలు తన కొడుకును మోసం చేశారని కిరణ్ చౌదరి తల్లి రత్నం ఆరోపిస్తున్నారు. తమకు చెందిన ఓ భూమి వివాదంలో ఉందని.. ఐతే ఆ సమస్య పరిష్కారానికి వైసీపీ నేతలను సాయం అడిగితే.. వాళ్ల తీరుతో ప్రాణాలకే ముప్పు వచ్చిందని ఆరోపిస్తున్నారు. వివాదంలో ఉన్న భూమి పత్రాలు తీసుకుని.. అసలు డబ్బే రాదని బెదిరించారని.. ఎంత బతిమిలాడినా కనీసం తమ బాధ పట్టించుకోలేదని కిరణ్ చౌదరి తల్లి అంటున్నారు. పైగా తన కుమారుడిని వైసీపీ నేతలు అంతా కలిసి బెదిరించారని.. వెనక్కి తగ్గకపోతే అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చారని ఆమె తల్లి అంటున్నారు. ఈ బాధతో తీవ్ర మనస్తాపానికి గురైన కిరణ్ చౌదరి.. ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తల్లి అంటున్నారు.
ఎలాగైనా తమకు న్యాయం చేయాలని.. కల్యాణ్ కృష్ణ విషయంలో చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఇక కల్యాణ్ కృష్ణ.. సోగ్గాడే చిన్న నాయన, రారండోయ్ వేడుక చూద్దాం, నేలటికెట్, బంగార్రాజు సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏపీ మంత్రి కురసాల కన్నబాబుకు కల్యాణ్ కృష్ణ తమ్ముడు. ఈయనే తమ భూమి లాక్కున్నారని.. కిరణ్ చౌదరి తల్లి ఆరోపిస్తున్నారు.