Drug Case: పబ్బుల మాటున డ్రగ్స్ విక్రయాలు.. డ్రగ్స్ కేసులో ఏ29గా నవదీప్..
ఈ కేసులో నార్కోటిక్ పోలీసులు నవదీప్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ డ్రగ్స్ కేసులో తవ్వేకొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పబ్బుల బాగోతాలు బయటపడుతున్నాయి. హైటెక్స్‌లోని SNORT పబ్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు, ప్రస్తుతం పరారీలో ఉన్న పబ్ ఓనర్ సూర్య కోసం వెతుకుతున్నారు.
Drug Case: మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నవదీప్‌ను ఏ29గా చేర్చారు. ఈ కేసులో నార్కోటిక్ పోలీసులు నవదీప్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ డ్రగ్స్ కేసులో తవ్వేకొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పబ్బుల బాగోతాలు బయటపడుతున్నాయి. హైటెక్స్‌లోని SNORT పబ్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు, ప్రస్తుతం పరారీలో ఉన్న పబ్ ఓనర్ సూర్య కోసం వెతుకుతున్నారు. పబ్‌కి వచ్చే కస్టమర్లకు సూర్య డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
అలాగే జూబ్లీహిల్స్‌లోని టెర్రా కేఫ్ అండ్ బ్రిస్టో పబ్‌లోనూ డ్రగ్స్ విక్రయాలు సాగుతున్నాయి. ఈ పబ్ ఓనర్ అర్జున్ కూడా పరారీలో ఉన్నాడు. అతడి కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారు. SNORT పబ్ న్యూసెన్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారిందనే విమర్శలున్నాయి. గతంలో ఈ పబ్‌పై పలు కేసులు నమోదయ్యాయి. అధికారులు రెండు నెలల పాటు ఈ పబ్‌ను సీజ్ చేశారు. అయినా తీరు మార్చుకోకుండా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు డ్రగ్స్ తీసుకునేందుకు మాత్రమే అడ్డాలుగా ఉన్న పబ్‌లు.. ఇప్పుడు డ్రగ్స్ విక్రయ కేంద్రాలుగా మారుతున్నాయి.
హీరో నవదీప్‌కు నోటీసులు
మాదాపూర్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్ పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. కొందరు నిందితుల్ని అరెస్టు చేయగా, మరికొందరు పరారీలో ఉన్నారు. డ్రగ్స్ వాడిన నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో హీరో నవదీప్‌ను ఏ29గా చేర్చారు. దీంతో నవదీప్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. గురువారం పోలీసులకు నవదీప్ అందుబాటులోకి వచ్చారని సమాచారం. కాగా.. షాడో సినిమా నిర్మాతల్లో ఒకరైన ఉప్పలపాటి రవి, మోడల్ శ్వేత, ఈవెంట్ ఆర్గనైజర్ కలహర్ రెడ్డి ఇంకా పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు అరెస్టు చేసిన కృష్ణ ప్రసాద్ జాబితాలో మోడల్ శ్వేత, కలహర్ రెడ్డి పేర్లున్నాయి. బెంగళూరు డ్రగ్స్ కేసులోనూ కలహర్ రెడ్డి పేరు ఉంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నిర్మాత సుశాంత్ రెడ్డి, హీరో నవదీప్, నిర్మాత రవి ఉప్పలపాటి, గచ్చిబౌలిలో స్నాట్ పబ్ నిర్వహించే సూర్య, జూబ్లీహిల్స్‌లోని టెర్రా కెఫే అండ్ బిస్ట్రో బార్ నిర్వాహకుడు అర్జున్, కలహర్ రెడ్డి, ఇంద్రతేజ్, శ్వేత, కార్తిక్ ఉన్నారు. వీరిలో పరారీలో ఉన్నావారిని పట్టుకునేందుకు స్పెషల్ టీం ఏర్పాటు చేశారు పోలీసులు. ఇప్పటివరకు 8 మంది నిందితులను కోర్టులో హాజరు పర్చగా, వారికి ఈనెల 27 వరకు రిమాండ్ విధించింది కోర్టు.