Prakash Raj: రూ.100 కోట్ల స్కాం.. ప్రకాష్ రాజ్‌కు ఈడీ నోటీసులు
ఈ కేసుకు సంబంధించి వచ్చేవారం చెన్నైలో జరిగే విచారణకు హాజరు కావాలని ప్రకాష్ రాజ్‌కు పంపిన నోటీసుల్లో ఈడీ పేర్కొంది. కేరళలోని తిరుచ్చికి చెందిన ప్రణవ్ జూవెలర్స్ అనే సంస్థపై నవంబర్ 20న ఈడీ దాడి చేసింది. ఇందులో లెక్క చెప్పని రూ.23.70 లక్షల నగదు, 11.60 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుంది ఈడీ.

Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. రూ.100 కోట్ల పోంజీ స్కామ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ (money laundering) కేసులో ప్రకాష్ రాజ్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి వచ్చేవారం చెన్నైలో జరిగే విచారణకు హాజరు కావాలని ప్రకాష్ రాజ్‌కు పంపిన నోటీసుల్లో ఈడీ పేర్కొంది. కేరళలోని తిరుచ్చికి చెందిన ప్రణవ్ జూవెలర్స్ అనే సంస్థపై నవంబర్ 20న ఈడీ దాడి చేసింది. ఇందులో లెక్క చెప్పని రూ.23.70 లక్షల నగదు, 11.60 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుంది ఈడీ.
DK Shivakumar: తెలంగాణలో రెండు రోజులు డీకే శివకుమార్ పర్యటన..
ఈ సంస్థతో సంబంధం ఉన్న ప్రకాష్ రాజ్‌కు తాజాగా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రణవ్ జూవెలర్స్ అనే ఆభరణాల సంస్థకు ప్రకాష్ రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అందువల్ల ఈ సంస్థకు సంబంధించిన లావాదేవీలపై ఈడీ అధికారులు విచారణ జరపనున్నారు. తమిళనాడు పోలీస్ ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. పోంజీ పథకం పేరుతో బంగారంపై పెట్టుబడుల పథకం పేరుతో ప్రజల నుంచి ఈ సంస్థ రూ.100 కోట్లు వసూలు చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే.. ఎక్కువ రిటర్న్స్ ఇస్తామని ఆశ చూపించి, భారీ పెట్టుబడులు రాబట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే, ఇచ్చిన హామీ ప్రకారం పెట్టుబడిదారులకు రాబడి ఇవ్వడంలో ఈ సంస్థ విఫలమైంది. పెట్టుబడిదారుల్ని మోసం చేసింది. కాగా.. ఈ జువెలర్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించిన ప్రకాష్ రాజ్ వారి నుంచి ఫీజు తీసుకున్నారు. ఈ సంస్థ ప్రకాష్ రాజ్‌కు చేసిన చెల్లింపుల వివరాలు ఇవ్వాల్సిందిగా ఆయనను కోరారు. ప్రకాష్ రాజ్‌కు ఈడి అధికారులు నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.