Hamas, Israel War : హద్దులు దాటుతున్న హమాస్.. ఇజ్రాయెల్‌కు తోడు నిలవాల్సిన సమయం వచ్చిందా..?
ఎనఫ్ ఈజ్ ఎనఫ్. దేనికైనా ఓ హద్దు ఉంటుంది. యుద్ధం చేయడానికి కూడా ఓ రీతి ఉంటుంది. ఇప్పటికే చాలా డ్యామేజ్ జరిగింది. రోజురోజుకూ హమాస్ మిలిటెంట్ల అరాచకాలు హద్దుమీరుతున్నాయి. అసలు పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైంది దేనికి? ఇప్పుడు మధ్యలో చనిపోతున్నవాళ్లు ఎవరు. అమాయక ప్రజల మీద దాడులు చేస్తున్నారు ఈ హమాస్ మిలిటెంట్లు. ఆఖరికి చిన్న పిల్లలను కూడా విడిచిపెట్టడంలేదు. నిన్నటికి నిన్న 40 మంది చిన్న పిల్లల తలలు నరికారు ఈ కిరాతకులు.

Enough is enough. Everything has a limit There is also a way to fight Already a lot A lot of damage was done to Israel Day by day, the anarchy of Hamas militants is increasing.
ఎనఫ్ ఈజ్ ఎనఫ్. దేనికైనా ఓ హద్దు ఉంటుంది. యుద్ధం చేయడానికి కూడా ఓ రీతి ఉంటుంది. ఇప్పటికే చాలా డ్యామేజ్ జరిగింది. రోజురోజుకూ హమాస్ మిలిటెంట్ల అరాచకాలు హద్దుమీరుతున్నాయి. అసలు పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైంది దేనికి? ఇప్పుడు మధ్యలో చనిపోతున్నవాళ్లు ఎవరు. అమాయక ప్రజల మీద దాడులు చేస్తున్నారు ఈ హమాస్ మిలిటెంట్లు. ఆఖరికి చిన్న పిల్లలను కూడా విడిచిపెట్టడంలేదు. నిన్నటికి నిన్న 40 మంది చిన్న పిల్లల తలలు నరికారు ఈ కిరాతకులు. ఇంట్లోకి దూరి మరి చిన్న పిల్లలను వాళ్లతో తీసుకువెళ్తున్నారు. వాళ్ల తోబుట్టువుల ముందే వాళ్లను చంపేస్తున్నారు. వీళ్లకంటే తాలిబాన్లే నయం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.
ఏళ్ల నాటి వివాదానికి ఈ చిన్న పిల్లలకు ఏంటి సంబంధం. రీసెంట్‌గా మ్యూజిక్ ఈవెంట్‌కు వచ్చిన ఓ అమ్మాయిని కిడ్నాప్ చేశారు. మ్యూజిక్ ఈవెంట్ మీద దాడి చేశారు. దాదాపు 260 మందిని చంపేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. సామాన్యుల ఇళ్లపై దాడి చేస్తున్నారు. సైరన్ వినిపిస్తే చాలా భయంతో వణికిపోతున్నారు అక్కడి ప్రజలు. బంకర్లలో, బేస్‌మెంట్లలో తలదాచుకుంటున్నారు. అసలు ఈ మిలిటెంట్ల సమస్య ఏంటి. వాళ్లు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. వందేళ్ల నాటి సమస్యకు ఒక్క యుద్ధంతో ఫుల్‌స్టాప్ పెట్టాలి అనుకుంటున్నారా. లేక ప్రత్యర్థి అనేవాడు లేకుండా చేయాలి అనుకుంటున్నారా.
వాళ్ల పాయింట్ ఏంటి.. వాళ్లది అని చెప్పుకుంటున్న భూమిని దక్కించుకోవడమా.. ఆ భూమిపై మనిషి అనేవాడు లేకుండా చేయడమా. నష్టం రెండు వైపులా జరుగుతోంది. కానీ రెండు దేశాల్లో ఇజ్రాయెల్ మాత్రం కోలుకోలేని స్థితికి వెళ్లిపోతోంది. ఇదే ఆఖరిది అనుకున్న ప్రతీసారి దానికంటే దారుణాలు బయటికి వస్తున్నాయి. ఆస్తుల సంగతి దేవుడెరుగు.. ప్రాణాలతో ఉంటే చాలు అని చాలా మంది పారిపోతున్నారు. అలా పారిపోయినా ప్రాణాలు దక్కుతామన్న గ్యారెంటీ లేదు. ఏ రోడ్డుమీద ఏ మిలిటెంట్ కాల్చి చంపేస్తాడో తెలియని పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్‌లో ఇజ్రాయెల్‌కు ప్రతీ దేశం మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. పరిష్కారం సంగతి తరువాత.. ముందు యుద్ధం ఆపేలా ప్రతీ దేశం ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ కాకపోతే ఇజ్రాయెల్ బోర్డర్ ప్రాంతం మొత్తం స్మశానంగా మారడం మాత్రం ఖాయం.