Fake Baba: నవ వధువుపై అత్యాచార ఘటనలో కీచక బాబా అరెస్ట్
తన దగ్గరకు వచ్చిన మహిళను పరిశీలించిన బాబా.. మహిళకు దెయ్యం పట్టిందని నమ్మించాడు. దెయ్యాల్ని వదిలిస్తానని చెప్పి అత్తామామల్ని నమ్మించాడు. అనంతరం, వారిని బయటే ఉండమని చెప్పి, మహిళను ఒక గదిలోకి తీసుకెళ్లాడు.
Fake Baba: బండ్లగూడలో నవ వధువుపై ఇటీవల అత్యాచారానికి పాల్పడ్డ కీచక బాబాను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని హుస్సేని ఆలం ప్రాంతానికి చెందిన ఒక యువతికి మూడు నెలల క్రితం వివాహమైంది. పెళ్లి అయిన తర్వాత నుంచి నవ వధువు ఆరోగ్యం క్షీణించింది. ఆమె ఆరోగ్యం మరింత విషమించడంతో, అత్తామామలు ఆమెను బండ్లగూడలోని మాజర్ ఖాన్ అనే బాబా వద్దకు తీసుకెళ్లారు. అతడు ఒక యునాని మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు.
తన దగ్గరకు వచ్చిన మహిళను పరిశీలించిన బాబా.. మహిళకు దెయ్యం పట్టిందని నమ్మించాడు. దెయ్యాల్ని వదిలిస్తానని చెప్పి అత్తామామల్ని నమ్మించాడు. అనంతరం, వారిని బయటే ఉండమని చెప్పి, మహిళను ఒక గదిలోకి తీసుకెళ్లాడు. అనంతరం కళ్లకు గంతలు కట్టి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్తే చంపేస్తానని ఆమెను బాబా బెదిరించాడు. అయితే, ఈ ఘటనను మహిళ అత్తామామలకు, భర్తకు చెప్పింది.
అయినప్పటికీ వారు పట్టించుకోలేదని బాధిత మహిళ ఆరోపించింది. తర్వాత మహిళ తల్లిదండ్రులకు విషయం తెలియడంతో, వారు బండ్లగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే నిందితుడు మాజర్ ఖాన్ పరారీలో ఉన్నాడు. అతడికోసం గాలించిన పోలీసులు చివరకు నిందితుడిని బండ్లగూడలో అరెస్టు చేశారు.