Visakhapatnam: ఉలిక్కిపడ్డ విశాఖ.. ఇండస్ హాస్పిటల్ ప్రమాదానికి కారణం ఇదే..
జగదాంబ సెంటర్‌లోని ఇండస్ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిస్థితిని హాస్పిటల్ సిబ్బంది అర్థం చేసుకునేలోపే మంటలు పైఫ్లోర్లకు కూడా వ్యాపించాయి. దీంతో హాస్పిటల్ మొత్తం పొగతో నిండిపోయింది.
Visakhapatnam: భారీ అగ్నిప్రమాదంతో విశాఖ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సిటీలో మెయిన్ సెంటర్ అయిన జగదాంబ సెంటర్లో ఈ ప్రమాదం జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగదాంబ సెంటర్‌లోని ఇండస్ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిస్థితిని హాస్పిటల్ సిబ్బంది అర్థం చేసుకునేలోపే మంటలు పైఫ్లోర్లకు కూడా వ్యాపించాయి. దీంతో హాస్పిటల్ మొత్తం పొగతో నిండిపోయింది.
REVANTH REDDY: మొన్న జీవన్ రెడ్డి.. నిన్న మల్లారెడ్డి.. ఎవరినీ వదలని రేవంత్.. బీఆర్ఎస్‌లో టెన్షన్
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు పోలీసుల ప్రైమరీ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. కరెంట్ వైర్లలో మంటలు చెలరేగిన కారణంగానే వేగంగా పై ఫ్లోర్లకు కూడా మంటలు వ్యాపించినట్టు డాక్టర్లు చెప్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది స్పాట్‌కు చేరుకున్నారు. హుటాహుటిన సహాయక చర్యలు ప్రారంభించారు. మొత్తం 12 ఫైర్ ఇంజన్లతో మంటలార్పారు. ప్రమాద సమయంలో హాస్పిటల్‌లో మొత్తం 40 మంది పేషెంట్లు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. వాళ్లందరినీ చాలా చాకచక్యంగా బయటికి తీసుకువచ్చారు. సహాయక సిబ్బంది ఓ వైపు మంటలు అదుపుచేస్తూనే మరోవైపు పేషెంట్లను రక్షించారు. నిచ్చెనల సహాయంతో పేషెంట్లకు ఎలాంటి ప్రమాదం జరగకుండా బయటికి తీసుకువచ్చారు.
ప్రస్తుతం వాళ్లంతా వేరే హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ ఓ వ్యక్తి చనిపోగా మరికొందరు పేషెంట్లు గాయపడ్డారు. వాళ్లంతా ప్రస్తుతం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ జరిపిస్తామని పోలీసులు చెప్తున్నారు. విచారణ అనంతరం పూర్తిస్థాయి నివేదిక సమర్పిస్తామని చెప్తున్నారు.