FIRE ACCIDENT: ఫార్మా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. 50 మందిని కాపాడిన బాలుడు
శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీలో చిక్కుకున్న వారిని రక్షించినట్లు తెలుస్తోంది.
FIRE ACCIDENT: రంగారెడ్డి జిల్లా, షాద్‌నగర్ పరిధిలోని ఆల్విన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీలో చిక్కుకున్న వారిని రక్షించినట్లు తెలుస్తోంది.
VV Lakshminarayana: రక్షణ కల్పించండి.. జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణహాని..?
అయితే, ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న 50 మందిని కాపాడటంలో ఒక బాలుడు సహాయం చేశాడని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. సాయి చరణ్ అనే బాలుడు.. ప్రమాదాన్ని గుర్తించి.. భవనం పైకి ఎక్కి తాడు కట్టాడు. ఈ తాడు సాయంతోనే ఫ్యాక్టరీలోని 50 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డట్లు తెలుస్తోంది. కార్మికుల్ని కాపాడిన బాలుడిని పోలీసులు, ఫైర్ సిబ్బంది అభినందించారు. ఒక్కరికి మాత్రం స్వల్ప గాయమైనట్లు సమాచారం. ఫ్యాక్టరీ సమీపంలో వెల్డింగ్ వర్క్ చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగసి.. అక్కడే ఉన్న ప్లాస్టిక్, థర్మకోల్‌పై పడ్డాయి. దీంతో మంటలు చెలరేగాయి. ఇది గమనించిన కార్మికులు త్వరగా ఫ్యాక్టరీ నుంచి బయటపడ్డారు.
ప్రస్తుతం మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది పని చేస్తున్నారు. ఇంకా మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. ఐదు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు. పక్కనే మరికొన్ని కెమికల్ ఫ్యాక్టరీలు ఉండటంతో.. ముందు జాగ్రత్తగా ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నారు. కార్మికులంతా సురక్షితంగా బయటపడటంతో స్థానికులు, కార్మికుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.