Uttar Pradesh: మొబైల్ పేలి చెలరేగిన మంటలు.. నలుగురు చిన్నారులు మృతి..
స్థానిక పల్లవపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జానీ కుటుంబం నివాసం ఉంటోంది. శనివారం సాయంత్రం ఇంట్లో.. మంచం సమీపంలో ఫోన్ చార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా, మొబైల్ పేలింది. దీంతో మంటలు పక్కనే ఉన్న మంచం, బెడ్‌షీట్‌కు అంటుకున్నాయి.
Uttar Pradesh: మొబైల్ ఫోన్ నలుగురు చిన్నారుల ప్రాణాలు బలిగొంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మొబైల్ ఫోన్ పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటలు అంటుకుని నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది. స్థానిక పల్లవపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జానీ కుటుంబం నివాసం ఉంటోంది. శనివారం సాయంత్రం ఇంట్లో.. మంచం సమీపంలో ఫోన్ చార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా, మొబైల్ పేలింది.
Kangana Ranaut: లోక్‌సభ ఎన్నికల్లో కంగనా.. ఆ పార్టీ నుంచే పోటీ..
దీంతో మంటలు పక్కనే ఉన్న మంచం, బెడ్‌షీట్‌కు అంటుకున్నాయి. క్షణాల్లోనే మంటలు చెలరేగి.. పక్కనే ఉన్న చిన్నారులు సారిక (12), నిహారిక (8), గోలు (6), కల్లు (5)కు అంటుకున్నాయి. మంటల కారణంగా వారికి తీవ్ర గాయాలయ్యాయి. పక్కనే ఉన్న చిన్నారుల తండ్రి జానీ (39), తల్లి బబిత (35) చిన్నారుల మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయాలపాలైన అందరినీ హాస్పిటల్‌కు తరలించారు. వేర్వేరు హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతూ నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
జానీకి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు చెప్పారు. అయితే, బబిత పరిస్థితి మాత్రం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమెను మెరుగైన ట్రీట్‌మెంట్ కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మొబైల్ కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది.