KARACHI BAKERY: కరాచీ బేకరీలో సిలిండర్ పేలుడు.. 15 మందికి గాయాలు.. ఆరుగురి పరిస్థితి విషమం
బేకరీ వంటగదిలోని సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించి, 15 మంది గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడ్డ ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

KARACHI BAKERY: ప్రమాద బాధితుల్లో 8 మందిని కంచన్ బాగ్ డీఆర్డీవో ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్, రాజేంద్ర నగర్‌లోని కరాచీ బేకరీలో గురువారం పేలుడు సంభవించింది. బేకరీ వంటగదిలోని సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించి, 15 మంది గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడ్డ ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Padi Kaushik Reddy: అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి కూతురు అత్యుత్సాహం.. షాకైన సీఎం రేవంత్ రెడ్డి..
ప్రమాద బాధితుల్లో 8 మందిని కంచన్ బాగ్ డీఆర్డీవో ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికులున్నట్లు తెలుస్తోంది. ఘటన సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కరాచీ బేకరీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం.. గాయపడ్డ కార్మికులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని అధికారులను ఆదేశించారు. మెరుగైన వైద్య సదుపాయాలు అందచేయడానికి వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం ఆదేశాలు ఇచ్చారు.