GIRL CHEATING: దొంగ ఆమే.. బాధితురాలూ ఆమే.. నువ్ మహానటివి తల్లి..
మనిషికి ఆశ ఉండాలా.. అది ఎంతవరకూ ఉండాలో అంతవరకే ఉండాలా.. అలా కాదని అత్యాశకి పోయి అతి తెలివి ప్రదర్శిస్తే ఇలాగే జైలుపాలు కావాల్సి ఉంటుంది. అలాంటి అమ్మాయి కథే ఇది. ఈ యువతి ఇంట్లో దొంగలు పడ్డారు.

GIRL CHEATING: ఈ మాటలు వింటుంటే అయ్యో పాపం అనిపిస్తుంది కదా.. ఆగండాగండీ.. అసలు విషయం తెలిస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవడం ఖాయం. ఈ అమ్మాయి మాములు నటి కాదు.. మహానటి. దొంగతనం చేసి.. దొంగతనం జరిగిందని కన్నీళ్లు పెట్టుకొని.. నమ్మించి మోసం చేయాలని ప్లాన్ చేసి.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది. మనిషికి ఆశ ఉండాలా.. అది ఎంతవరకూ ఉండాలో అంతవరకే ఉండాలా.. అలా కాదని అత్యాశకి పోయి అతి తెలివి ప్రదర్శిస్తే ఇలాగే జైలుపాలు కావాల్సి ఉంటుంది.
Elon Musk: ఇండియాకి ఎలాన్ మస్క్.. టెస్లా కార్ల తయారీ ఇక్కడే..
అలాంటి అమ్మాయి కథే ఇది. ఈ యువతి ఇంట్లో దొంగలు పడ్డారు. బంగారం, వెండి నగలతో పాటు బీరువాలో ఉన్న డబ్బులు ఎత్తుకెళ్లిపోయారు. గట్టిగా కేకలు వేస్తూ దొంగలను పట్టుకునేందుకు ఆ అమ్మాయి ప్రయత్నించింది. కానీ దొంగలు మాత్రం ఆమెను తోసేసి పారిపోయారు. ఇదీ.. ఆ అమ్మాయి చెప్పిన విషయం. ఐతే జరిగింది మాత్రం ఇంకొకటి. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఐతే వాళ్లకు ఎక్కడా, ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. దీంతో ఈ కథ వేరే ఉందని అనుమానపడి.. అమ్మాయిని పిలిపించి తమ స్టైల్‌లో ప్రశ్నించారు. దీంతో ఆ యువతి అసలు విషయం బయటకు చెప్పేసింది. అసలు ఆ ఇంట్లో దొంగలే పడలేదు. ఈ సీన్ మొత్తం ఆ అమ్మాయి క్రియేట్ చేసింది.
ఎందుకు అంటే.. ఆన్‌లైన్ గేమ్స్‌లో డబ్బులు పోగొట్టుకొని అప్పులు చేసి.. వాటిని తీర్చేదుకు చోరీ డ్రామా నడిపింది. ఇంట్లో బంగారం తాకట్టు పెట్టి మరీ.. ఈ యువతి గేమ్స్ ఆడి ఇల్లు గుల్ల చేసుకుంది. ఇది ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఉండేందుకు.. దొంగలు పడ్డారు అనే సీన్ క్రియేట్ చేయాలి అనుకుంది. ఇంట్లోని వస్తువులను తానే చిందరవందరగా పడేసి.. బీరువా పగలగొట్టి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇంకేముంది.. ఈజీగా దొరికిపోయింది.