China Great Wall: షార్ట్‌ కట్‌ కోసం గ్రేట్‌వాల్‌ ఆఫ్‌ చైనాను తవ్వేశారు..

చైనాలో మాత్రం ఇద్దరు వ్యక్తులు షార్ట్‌ కట్‌ కోసం ఏకంగా గ్రేట్‌వాల్‌ ఆఫ్‌ చైనాకు కన్నం పెట్టేశారు. తమ ప్రయాణ దూరం తగ్గించుకునేందుకు ఓ ప్రాంతంలో గోడను ధ్వసం చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 5, 2023 | 07:29 PMLast Updated on: Sep 05, 2023 | 7:29 PM

Great Wall Of China Damaged By Workers Looking For Shortcut With Excavator

China Great Wall: ఏ దేశంలో ఐనా పురాతన కట్టడాలను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. వాటిని ఎవరూ ధ్వసం చేయకుండా సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేస్తుంటారు. కేవలం ప్రభుత్వాలే కాదు.. ఈ వారసత్వాన్ని కాపాడుకునే బాధ్యత దేశ ప్రజలపై కూడా ఉంటుంది. కానీ చైనాలో మాత్రం ఇద్దరు వ్యక్తులు షార్ట్‌ కట్‌ కోసం ఏకంగా గ్రేట్‌వాల్‌ ఆఫ్‌ చైనాకు కన్నం పెట్టేశారు.

తమ ప్రయాణ దూరం తగ్గించుకునేందుకు ఓ ప్రాంతంలో గోడను ధ్వసం చేశారు. చైనాలోని ఉత్తర షాక్సి ప్రావిన్స్‌లో జరిగింది ఈ ఇన్సిడెంట్‌. ఈ ప్రావిన్స్‌లో యూయు కౌంటీ వద్ద యాంగ్‌క్యాన్హె టౌన్‌షిప్‌ సమీపంలో గ్రేట్‌వాల్‌ను తవ్వేసినట్టు అధికారులకు సమాచారం వచ్చింది. వెళ్లి చూస్తే గోడను తవ్వేసి చిన్న మార్గం ఏర్పాటు చేసుకున్నారు ఈ పని చేసిన వ్యక్తులు. ఇద్దరు వ్యక్తులు కలిసి మెషీన్ల సహాయంతో ఈ పని చేసినట్టు స్థానికులు చెప్తున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఇక్కడే ఓ కాంట్రాక్ట్‌ చేపడుతున్నారు. రోజు ఆ ప్రాంతానికి వెళ్లి రావడానికి గోడ అడ్డుగా ఉంటుంది.

అది దాటాలంటే చాలా దూరం ప్రయాణం చేయాలి. అందుకే ఆ గోడను అడ్డు తొలగించాలి అనుకున్నారు. యూయు కౌంటీ వద్ద గోడకు ఉన్న చిన్న పగులును మెషీన్ల సహాయంతో పెద్దగా చేసి ఏకంగా రోడ్డు వేసుకున్నారు. చైనాలో అత్యధిక మంది సందర్శకులు వచ్చే ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.