Salman Khan: సల్మాన్ హత్యకు మరోసారి యత్నం.. ఇంటివద్ద కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనేనా..?
నిందితులు.. ఉదయం ఐదు గంటల సమయంలో బైకులపై వచ్చిన దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. కాల్పులు జరిపిన వెంటనే అక్కడ్నించి పరారయ్యారు. ఈ ఘటనతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
Salman Khan: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటివద్ద కలకలం రేగింది. ఆయన ఇంటివద్ద దుండగులు.. మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆదివారం తెల్లవారుఝామున ఈ ఘటన జరిగింది. సల్మాన్ నివసిస్తున్న బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్ బయట ఇద్దరు దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. నిందితులు.. ఉదయం ఐదు గంటల సమయంలో బైకులపై వచ్చిన దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. కాల్పులు జరిపిన వెంటనే అక్కడ్నించి పరారయ్యారు.
FAMILY STAR: ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. ముందుగానే వచ్చేస్తుందా..?
ఈ ఘటనతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే సమాచారం అందుకున్న క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు, ఫోరెన్సిక్ సైన్స్ నిపుణుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని, ఆధారాలు సేకరించింది. ప్రస్తుతం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. కాల్పుల ఘటనతో అప్రమత్తమైన పోలీసులు.. సల్మాన్ ఖాన్ నివాసం బయట భద్రతను కట్టుదిట్టం చేశారు. నిందితులను గుర్తించడానికి పోలీసులు సిసిటివి కెమెరాల ఫుటేజీని సేకరిస్తున్నారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే.. సల్మాన్‌ఖాన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం ముంబై పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి సల్మాన్ ఖాన్‌కు భద్రత పెంచాలని ఆదేశించారు. మరోవైపు.. సల్మాన్‌ఖాన్ నివాసంపై కాల్పులు జరిపింది తామేనని ప్రకటించుకుంది గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అనుమోల్ బిష్ణోయ్ కాల్పులు జరిపింది తామేనని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం లారెన్స్ జైలులో ఉన్నాడు. అయితే, అతడి గ్యాంగ్ జైలు నుంచే మర్డర్స్ ప్లాన్ చేస్తుందనే వాదన ఉంది. తాజా కాల్పులు.. ట్రైలర్ మాత్రమే అని పిక్చర్ ముందుందని సోషల్ మీడియా పోస్ట్ చేశాడు.
ఈ సారి ఇంటిపై కాల్పులు జరపమని.. ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ లేఖలో పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్‌కు ఎప్పటినుంచో ప్రాణహాని పొంచి ఉంది. కృష్ణ జింకను చంపినందుకుగాను.. సల్మాన్‌ను చంపుతామంటూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్, అతడి బృందం ఎప్పటినుంచో హెచ్చరిస్తోంది. అంతేకాదు.. ఇప్పటికే సల్మాన్‌ను చంపేందుకు పలుమార్లు రెక్కీ నిర్వహించారు. దీంతో ఇప్పటికే సల్మాన్ ఖాన్‌కు ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది. తాజా ఘటన నేపథ్యంలో ఈ భద్రతను మరింత పెంచారు.