Hardik Pandya: పాండ్యా బ్రదర్స్‌కు కుచ్చు టోపీ.. వ్యాపారంలో కోట్లు మోసం చేసిన కజిన్

ఫోర్జరీ ద్వారా దాదాపు రూ.4.3 కోట్ల నిధులు మళ్లించిన నేపథ్యంలో వైభవ్‌ పాండ్యాపై కేసు నమోదు చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యాలకు 37 ఏళ్ల వైభవ్‌ పాండ్యా సవతి సోదరుడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 11, 2024 | 03:33 PMLast Updated on: Apr 11, 2024 | 3:34 PM

Hardik Pandyas Stepbrother Vaibhav Pandya Arrested By Mumbai Police For Cheating Of Rs 4 3 Crore

Hardik Pandya: టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌, ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, అతడి సోదరుడు కృణాల్ పాండ్యా అతని కజిన్ చేతిలోనే మోసపోయారు. ఈ స్టార్ ఆటగాళ్లకు బంధువే కుచ్చి టోపీ పెట్టాడు. దాదాపు 4.3 కోట్లకు మోసం చేశాడు. దీంతో పాండ్య బ్రదర్స్ పిర్యాదు మేరకు వారి కజిన్ వైభవ్‌ పాండ్యాను పోలీసులు అరెస్ట్ చేశారు.

Shubman Gill: గిల్ అరుదైన రికార్డు.. కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన గుజరాత్ కెప్టెన్

ఫోర్జరీ ద్వారా దాదాపు రూ.4.3 కోట్ల నిధులు మళ్లించిన నేపథ్యంలో వైభవ్‌ పాండ్యాపై కేసు నమోదు చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యాలకు 37 ఏళ్ల వైభవ్‌ పాండ్యా సవతి సోదరుడు. వీరితో కలిసి అతడు 2021లో పాలిమర్‌ వ్యాపారం మొదలుపెట్టాడు. దీని కోసం హార్దిక్‌, కృనాల్‌ ఒక్కొక్కరు 40 శాతం.. వైభవ్‌ తన వంతు వాటాగా 20 శాతం పెట్టుబడి పెట్టారు. అయితే, సోదరులకు తెలియకుండా మరో సంస్థను మొదలుపెట్టిన వైభవ్‌.. పాత వ్యాపారంలోని నిధులను అక్కడికి మళ్లించాడు. హార్దిక్‌, కృనాల్‌లకు తెలియకుండా ఫోర్జరీ ద్వారా 4.3 కోట్లు తన సొంత వ్యాపారానికి వాడుకున్నాడు. దీంతో వారి వ్యాపారం తీవ్ర నష్టాలపాలైంది. ముగ్గురు కలిసి చేస్తున్న వ్యాపారంలో రూ.3 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి.

ఈ అంశంపై పాండ్యా సోదరులు.. వైభవ్‌ను నిలదీశారు. కానీ, తను మళ్లీ అడిగితే.. పరువు తీస్తానని వైభవ్ బెదిరించాడు. ఈ నేపథ్యంలో వైభవ్‌ పాండ్యాపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు పాండ్యా బ్రదర్స్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైభవ్‌ పాండ్యాను అరెస్టు చేశారు. కాగా హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా ప్రస్తుతం ఐపీఎల్‌‌తో బిజీగా ఉన్నారు. హార్దిక్‌ ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. కృనాల్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ఆడుతున్నాడు.