మనుషులా ? రాక్షసులా ? ఎందుకీ క్రూరత్వం
మనుషుల్లో క్రూరత్వం పెరిగిపోతోందా ? రాక్షసులను మించి ప్రవర్తిస్తున్నారా ? క్రూరత్వానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారా ? చంపడం...ముక్కలుగా నరకడం...పెరిగిపోతోందా ?
మనుషుల్లో క్రూరత్వం పెరిగిపోతోందా ? రాక్షసులను మించి ప్రవర్తిస్తున్నారా ? క్రూరత్వానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారా ? చంపడం…ముక్కలుగా నరకడం…పెరిగిపోతోందా ? కుక్కర్లలో ఉడికించి…ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారా ? మనుషుల్లో పైశాచికత్వం రోజు రోజుకు పెరిగిపోతోందా ? ఒకడ్ని మించి మరొకడు…సైకోల్లా ప్రవర్తిస్తున్నారా ? కట్టుకున్న పెళ్లాలు…ప్రేమించిన ప్రియురాళ్లను నడిరోడ్డులో నరికేస్తున్నారా ? ఇదే ఇవాళ్టీ టాప్ స్టోరీ.
ఒకడు ప్రియురాలిని చంపేసి ఫ్రిజ్ లో దాచేస్తాడు…ఇంకొకడు భార్యను ముక్కలు ముక్కలుగా నరుకుతాడు. మరొకడు డెడ్ బాడీ కుక్కర్ లో ఉడికిస్తాడు…మరో చోట బాడీని హీటర్ తో ఉడికించి…పౌడర్ చేస్తాడు. ఒకడిని మించిన క్రూరత్వంలో మరొకడిలో కనిపిస్తోంది. వందల సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా క్రూరమైన పాలకులు ఉండేవారు. ఆ క్రూరమైన నియంతల్లో ఉగాండా నియంత ఈదీ అమీన్ ముందు వరుసలో ఉంటాడు. పేరు చెబితే ఉగాండాలో వణికిపోయేవారు. ఈ ఉగాండా కసాయి…తన శత్రువులను హత్య చేసిన తరువాత, వారి మృతదేహాలను మరింత క్రూరంగా హింసించేవాడు. అంతే కాదు మృతదేహాలతో ఒంటరిగా ఎక్కువగా గడిపేవాడు. అమీన్ తన శత్రువులను చంపడమే కాదు…వారు చనిపోయిన తర్వాత వారి శవాలను కూడా వదిలేవాడు కాదు. మార్చురీలో శవాలు తెరిచి ఉంచేవాడు. వాటి మూత్రపిండాలు, కాలేయం, ముక్కు, పెదవులు మాత్రం గాయబ్ అయ్యేవి. ఈదీ అమీన్ మించిన సైకోలు…రాక్షసులు…ఇండియాలోనూ ఉన్నారు.
హైదరాబాద్ లో భార్య వెంకట మాధవిని హత్య చేసిన భర్త గురుమూర్తి…ఆమె ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రయత్నించాడు. డెడ్ బాడీని ముక్కముక్కలు చేశాడు. ఆ ముక్కలను పక్కన పెట్టుకొనే…రెండ్రోజుల పాటు మద్యం సేవించాడు. అంతటితో ఆగని పైశాచికత్వం…కుక్కర్ ఉడికించాడు. తర్వాత ఆ ముక్కలను రోట్లో వేసి దంచాడు. ఆ పౌడర్ ను డ్రైనేజ్ లో వేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్యతో…ఈ తరహా కిరాతక హత్యలకు ప్రారంభమయ్యాయి. అప్పట్నుంచీ ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టుగా పాశవిక హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో అఫ్తాబ్ అనే వ్యక్తి…తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాకర్ ను హత్య చేశాడు. అక్కడి దుర్మార్గుడు…ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి అటవీ ప్రాంతంలోని పడేశాడు. ముంబైలో పని చేస్తున్న సమయంలో నిందితుడు అఫ్తాబ్, శ్రద్ధా స్నేహితులయ్యారు. ఢిల్లీలో కొన్నాళ్లు సహజీవనం చేశారు. అయితే, పెళ్లి కోసం అఫ్తాబ్‌పై శ్రదా ఒత్తిడి చేయడంతో…ఆగ్రహంతో అఫ్తాబ్ శ్రద్ధ గొంతుకోసి హత్య చేశారు. హత్య తర్వాత శ్రద్ధా వాకర్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికినట్లు అఫ్తాబ్ ఒప్పుకున్నాడు. మృతదేహం వాసన రాకుండా ఉండేందుకు పెద్ద సైజు ఫ్రిజ్ కొని అందులో మృతదేహం ముక్కలను ఉంచాడు. అడవిలో మృతదేహం ముక్కలను విసిరేవాడు.
29 ఏళ్ల మహాలక్ష్మి అనే మహిళను చంపి.. 50కి పైగా ముక్కలుగా కోసాడో దుర్మార్గుడు. ర్తకు దూరంగా ఉంటున్న మహాలక్ష్మి అనే మహిళను.. ఆమె నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే హత్య చేసి, మృతదేహాన్ని 30 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచారు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో అపార్ట్‌మెంట్ వాసులు యజమానికి ఫిర్యాదు చేశారు. తొలుత పాడైపోయిన ఆహారం వల్ల దుర్వాసన వస్తుందేమోనని భావించారు. దుర్వాసన భరించలేని స్థాయిలో వస్తుండటంతో.. అపార్ట్‌మెంట్ ఓనర్ ఆ ఇంటి తాళాలు పగులగొట్టి లోపల పరిశీలించారు. రిఫ్రిజిరేటర్ నుంచి వాసన వస్తున్నట్లు గుర్తించి డోర్ ఓపెన్ చేసి హతాశులయ్యారు. మొత్తం మహిళ శరీర భాగాలు, రక్తంతో ఫ్రిజ్ నిండిపోయి ఉంది.
ఢిల్లీలోనే సాహిల్ గహ్లోట్ అనే వ్యక్తి…తన పార్ట్ నర్ నిక్కీ యాదవ్‌ను గొంతు కోశాడు. మృతదేహాన్ని ఫ్రిజ్‌లో పడేసిన కొన్ని గంటల తర్వాత మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. గతేడాది ముంబైలో జరిగిన హత్య మరింత సంచలనంగా రేపింది. ముంబై నగర శివార్లలో 32 ఏళ్ల మహిళతో సహజీవనం చేస్తున్న 56 ఏళ్ల మనోజ్ సహనీ.. సరస్వతి వైద్యను హత్య చేశాడు. ట్రీ కట్టర్ తో ఆమె శరీరాన్ని ముక్కలుగా చేశాడు. కొన్ని ముక్కలను కుక్కలకు ఆహారంగా వేసిన అతడు.. మరికొన్ని శరీర భాగాలను ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించి…ప్లాస్టిక్ కవర్లో వేసి పడేశాడు. గతేడాది హైదరాబాద్ లో నర్సు అనూరాధ రెడ్డిని హత్య చేసిన చంద్రమౌళి…మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్ లో దాచి పెట్టాడు. హత్య చేసిన మూడు రోజుల తరువాత.. తలను పడేయడంతో హత్య విషయం వెలుగు చూసింది.