Hyderabad POLICE: కంత్రీ పోలీసుల కహానీ ఖతమ్‌.. ఇద్దరిపై సస్పెన్షన్ వేటు..

పంజాగుట్ట ర్యాష్‌ డ్రైవింగ్ కేసు పోలీసుల మెడకు చుట్టుకుంది. పంజాగుట్ట ఇన్స్‌పెక్టర్‌ దుర్గారావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులో.. నిర్లక్ష్యం వహించినందుకు ఇన్స్‌పెక్టర్‌ దుర్గారావుపై చర్యలు తీసుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 27, 2023 | 06:43 PMLast Updated on: Dec 27, 2023 | 6:43 PM

Hyderabad Cp Suspends Panjagutta Sho Durga Rao And Two Others

Hyderabad POLICE: చిల్లర వేషాలు వేసిన పోలీసులు, అవినీతి పోలీసులపై కొరఢా ఝులిపించారు కమిషనర్లు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇన్స్‌పెక్టర్లను సస్పెండ్ చేశారు. హైదరాబాద్‌లో ఒకేరోజు ఆరుగురిని సస్పెండ్ చేసి.. తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టమనే సంకేతాలు పంపారు. పంజాగుట్ట ర్యాష్‌ డ్రైవింగ్ కేసు పోలీసుల మెడకు చుట్టుకుంది. పంజాగుట్ట ఇన్స్‌పెక్టర్‌ దుర్గారావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులో.. నిర్లక్ష్యం వహించినందుకు ఇన్స్‌పెక్టర్‌ దుర్గారావుపై చర్యలు తీసుకున్నారు.

MPhil admission: ఎంఫిల్‌కు గుర్తింపు లేదు.. కోర్సు తీసుకోవద్దంటున్న యూజీసీ

ర్యాష్‌ డ్రైవింగ్ చేసిన సాహిల్‌ను తప్పించి.. డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశారు పోలీసులు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపారు. కేసు విచారణలో నిర్లక్ష్యం వహించినందుకు దుర్గారావును సస్పెండ్ చేశారు. ఐతే బీపీ డౌన్‌ కావడంతో దుర్గారావు ఇప్పటికే ఆసుపత్రిలో చేరాడు. పంజాగుట్ట రాష్‌డ్రైవింగ్‌ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు చేసిన ఉన్నతాధికారులు.. మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు సొహైల్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. డ్రైవింగ్‌ చేసింది సొహైలే అని గుర్తించారు. కేసు నుంచి తప్పించుకునేందుకు సొహైల్‌ పెద్ద డ్రామానే ఆడాడు. తన బదులు డ్రైవర్‌ను లొంగిపోవాలని ఆదేశించాడు. దీంతో డ్రైవర్‌ ఆసిఫ్‌ లొంగిపోయాడు. కేసు తారుమారు చేసేందుకు ప్రయత్నించి పోలీసులు కూడా దొరికిపోయారు. ఉన్నతాధికారులు రంగంలోకి దిగడంతో అసలు కథ బయటకొచ్చింది. ఇక భార్యభర్తల మధ్య విబేధాల కేసులో అత్యుత్సాహం చూపించిన కేపీహెచ్‌బీ పోలీసులపైనా చర్యలు తీసుకున్నారు.

YS SHARMILA: షర్మిల మరో తప్పు చేస్తున్నారా..? ఏపీ కాంగ్రెస్‌లో చేరితే అంతేనా..?

బాధితుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ.. సీఐ, ఎస్సై సహా ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన ప్రణీత్‌కు అదే జిల్లాకు చెందిన శ్రీలక్ష్మితో 2018లో పెళ్లి జరిగింది. ఐతే మనస్పర్థలు రావడంతో ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. ప్రణీత్‌ ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీలక్ష్మి తన సర్టిఫికెట్లు భర్త వద్దే ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుంటూరులో దిశ కేసు కూడా ఫైల్‌ చేసింది. మరోసారి కేపీహెచ్‌బీ పీఎస్‌లో కూడా శ్రీలక్ష్మి.. భర్తపై కంప్లైంట్‌ చేసింది. దీంతో విచారణ కోసం ప్రణీత్‌ను పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. అప్పటికే తనపై గుంటూరులో కేసు నడుస్తుందని బాధితుడు పోలీసులకు తెలిపాడు. శ్రీలక్ష్మి తప్పుడు కేసు పెట్టిందని చెప్పినా పట్టించుకోకుండా తనను విచక్షణరహితంగా కొట్టారని సైబరాబాద్‌ సీపీకి ఫిర్యాడు చేశాడు. దీంతో విచారణకు ఆదేశించిన సీపీ అవినాష్‌ మహంతి.. ఎస్సైపై చర్యలు తీసుకున్నారు.

ఇక మియాపూర్ ఎస్సైది మరో కథ. ఓ కేసులో ఫిర్యాదు చేయడానికి వచ్చిన యువతితో వివాహేతర సంబంధం నడిపించాడు గిరిధర్‌రావు. చెట్టాపట్టాల్‌ వేసుకొని తిరిగాడు. అవినీతి ఆరోపణలు కూడా రావడంతో విచారణకు ఆదేశించారు సీపీ. ఆరోపణలు నిజమని తేలడంతో సస్పెండ్ చేశారు.