Hyderabad Drugs Case: ప్రియుడి కోసం డ్రగ్స్ దందా.. వరలక్ష్మీ టిఫిన్స్ కేసులో సంచలన విషయాలు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అనురాధ ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేది. భర్తతో విభేదాల కారణంగా అతనితో దూరంగా ఉండేందుకు హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యింది. వరలక్ష్మీ టిఫిన్స్ ఓనర్ ప్రభాకర్ రెడ్డితో పరిచయం ఏర్పడింది.

Hyderabad Drugs Case: ప్రేమలో పడితో మనుషులకు నట్ ఊడిపోతుంది. ఏం చేస్తున్నారో.. ఎందుకు చేస్తున్నారో కూడా తెలియకుండా లవర్ కోసం రిస్క్ చేసేందుకు రెడీ ఐపోతారు. వినేందుకు కాస్త ఇరిటేటింగ్‌గానే ఉన్నా ఇది నిజం. రీసెంట్‌గా జరిగిన వరలక్ష్మీ టిఫిన్స్ డ్రగ్స్ కేసులో కూడా ఇదే విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న అనురాధ.. తన ప్రియుడి కోసమే డ్రగ్స్ దందా మొదలుపెట్టిందని విచారణలో గుర్తించారు పోలీసులు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అనురాధ ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేది. భర్తతో విభేదాల కారణంగా అతనితో దూరంగా ఉండేందుకు హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యింది. వరలక్ష్మీ టిఫిన్స్ ఓనర్ ప్రభాకర్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొన్ని రోజులకు ప్రేమగా మారింది. అనురాధ.. ప్రభాకర్ రెడ్డిని ఎంతగా ప్రేమించింది అంటే.. అతని కోసం ఏకంగా గోవాకు వెళ్లి మరీ డ్రగ్స్ కొని హైదరాబాద్‌కు తీసుకుని వచ్చేది. ప్రియురాలే పెడ్లర్‌గా మారడంతో చాలా సింపుల్‌గా డ్రగ్స్ దందా చేయడం మొదలుపెట్టాడు ప్రభాకర్ రెడ్డి.
రీసెంట్‌గా వీళ్లిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభాకర్ రెడ్డిని తాను ప్రేమించానని.. అతనికోసమే డ్రగ్స్ సరఫరా చేశానని పోలీసు విచారణలో చెప్పింది అనురాధ. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. నిందితుల్ని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.