Bihar Lovers: కరెంట్ కట్ చేసి.. ప్రియుడిని కలిసి.. బిహార్‌లో కంత్రీ లవర్స్
ప్రేమను ప్రేమించిన ప్రేమ.. దేన్నైనా ప్రేమిస్తుందని కథలు కథలుగా చెప్తుంటారు ప్రేమికులు. ఈ లవర్స్ మాత్రం.. తమ ప్రేమ కోసం ఊరిని చీకట్లోకి నెట్టేశారు. అసలు విషయం తెలిసి అదే చీకటిలో.. ఇద్దరిని చితక్కొట్టారు ఆ గ్రామస్థులు.

In Bihar's Bethia district, electricity was cut and the two lovers, who met frequently, were handed over to the police by the villagers who came to know about this
ఎవరి కంటా కనిపించకూడదని ప్లాన్ చేసిన ఆ జంట.. భారీ ప్లాన్ వేసింది. అదే ఊరికి కరెంట్ కట్ చేయడం. రాత్రయితే చాలు.. ఒకే సమయంలో ఊరంతా కరెంట్ పోయేది. కొంతకాలంగా ఆ గ్రామంలో రాత్రయితే అంధకారం అలుముకుంటోంది. ఏంటా అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఓ రోజు మాటువేసి మరీ ఆ కరెంట్ కట్ చేస్తున్న దొంగల్ని పట్టుకున్నారు గ్రామస్థులు. తీరా చూస్తే వాళ్లిద్దరూ.. ఏకాంతంలో ఆనంద డోలికల్లో మునిగితేలుతున్నారు. ఈ ఘటన బిహార్‌లోని బేతియా జిల్లా నౌతన్ పీఎస్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది.
అదే గ్రామానికి చెందిన యువతి.. తన ప్రియుడిని రహస్యంగా కలుసుకునేందుకు ప్రతిరోజూ రాత్రి ఒకే సమయంలో ట్రాన్స్ ఫార్మర్ దగ్గరకు వెళ్లి కరెంట్ కట్ చేసేది. ఆ తర్వాత ఇద్దరూ ఏకాంతంగా కలుసుకునేవారు. ఓ రోజు రెండు బైక్ లు, కరెంట్ మోటార్లు, కొన్ని మేకలు కనిపించకుండా పోయాయ్. ఊళ్లోనే ఎవరో కావాలని చేస్తున్నారని గ్రామస్తులకు అనుమానం వచ్చింది. మాటు వేసి వాళ్లిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఊరందరికీ కరెంట్ తీసేసి.. వాళ్లిద్దరూ చేస్తున్న పని చూసిన గ్రామస్తులకు చిర్రెత్తింది. ఇద్దరికీ దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత ఇద్దరి కుటుంబాలతో మాట్లాడి.. వారి పెళ్లికి ఒప్పించారు. ఇలా కరెంట్ కథకు శుభమ్ కార్డ్ పడింది.