Kandula Jahnavi: మా ప్రాణాలకు విలువ లేదా..? అమెరికాపై మండిపడ్డ భారత్..!
కొన్ని రోజుల క్రితం తెలుగు విద్యార్థిని జాహ్నవి అమెరికాలో యాక్సిడెంట్‌లో చనిపోయింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న జాహ్నవిని పోలీసు ప్యాట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయింది. అదే టైంలో అక్కడ డ్యూటీ చేస్తున్న పోలీస్ ఒకరు ఆమె ప్రాణాలకు విలువ లేదంటూ మాట్లాడాడు.
Kandula Jahnavi: తెలుగు విద్యార్థి జాహ్నవి మృతి గురించి అమెరికన్ పోలీసులు చులకనగా మాట్లాడటంపై భారత ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వెంటనే ఈ వీడియో గురించి విచారణ చేపట్టాలంటూ అమెరికాలోని భారత దౌత్య కార్యాలయం ట్వీట్ చేసింది. కొన్ని రోజుల క్రితం తెలుగు విద్యార్థిని జాహ్నవి అమెరికాలో యాక్సిడెంట్‌లో చనిపోయింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న జాహ్నవిని పోలీసు ప్యాట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయింది. జాహ్నవి స్నేహితులు ఆమె ఫొటో పెట్టి నివాళులర్పించారు.
అదే టైంలో అక్కడ డ్యూటీ చేస్తున్న పోలీస్ ఒకరు ఆమె ప్రాణాలకు విలువ లేదంటూ మాట్లాడాడు. తాజాగా విడుదలైన ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. సియాటిల్, వాషింగ్టన్‌లోని ఉన్నతాధికారులు ఈ విషయంలో వెంటనే కలుగజేసుకోవాలని భారత ఎంబసీ డిమాండ్ చేసింది. ఇండియన్ ఎంబసీ ట్వీట్‌కు అమెరికా అధికారులు వెంటనే స్పందించారు. ఈ కేసులో వీలైనంత తొందరగా విచారణ చేపడతామంటూ చెప్పారు. ఒక మనిషి మృతి గురించి హేళన చేసే వ్యక్తులకు రక్షణ బాధ్యతల్లో ఉండే అర్హత లేదని.. వీడియోలో ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఈ విషయంపై ఇండియన్ అమెరికన్ చట్టసభల సభ్యులు కూడా తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యారు. మరోవైపు జాహ్నవికి మరణానంతర డిగ్రీ ఇవ్వాలని ఆమె విద్యనభ్యసించిన నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ నిర్ణయించింది.
ఆమె కుటుంబ సభ్యులకు ఈ డిగ్రీ అందజేస్తామని వెల్లడించింది. జాహ్నవి మృతిపై యూనివర్సిటీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధ్యులకు శిక్ష పడాలని కోరుతున్నట్లు తెలిపింది. అలాగే జాహ్నవి మృతితో విషాదంలో మునిగిన భారతీయ విద్యార్థులకు తాము అండగా ఉంటామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన జాహ్నవి ఉన్నత విద్య కోసం 2021లో అమెరికా వెళ్లింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన ప్రమాదంలో అక్కడ ప్రాణాలు కోల్పోయింది.