SAMSUNG PHONE: మీరు శాంసంగ్ ఫోన్ వాడుతున్నారా..? బిగ్ అలెర్ట్.. కేంద్రం ఏం చెప్పిందంటే..!
ఈ ఫోన్లు వాడేవాళ్ళు వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సెర్ట్ ఇన్ అలర్ట్ జారీ చేసింది. ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 OSతో పని చేసే శాంసంగ్ స్మార్ట్ ఫోన్లలో ఇలా భద్రతా పరమైన లోపం ఉన్నట్టు గుర్తించారు.
SAMSUNG PHONE: శాంసంగ్ స్మార్ట్ మొబైల్ వాడే వారికి బిగ్ అలెర్ట్. ఆ ఫోన్ వాడేవారికి కేంద్రం హెచ్చరికలు చేసింది. తమ ఫోన్లను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సెర్ట్ ఇన్ సూచించింది. లేకపోతే వినియోగదారులు రిస్కులో పడతారని అంటోంది. హ్యాకర్లు మీ డేటా కొల్లగొట్టేస్తారని వార్నింగ్ ఇచ్చింది. శాంసంగ్ స్మార్ట్ ఫోన్లలో సెక్యూరిటీ థ్రెట్ ఉన్నట్టు కేంద్రం గుర్తించింది. ఈ ఫోన్లు వాడేవాళ్ళు వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సెర్ట్ ఇన్ అలర్ట్ జారీ చేసింది.
RAJINI SAI CHAND: ఫొటో తీసేసి అవమానిస్తారా.. సాయిచంద్ భార్య కన్నీళ్లు
ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 OSతో పని చేసే శాంసంగ్ స్మార్ట్ ఫోన్లలో ఇలా భద్రతా పరమైన లోపం ఉన్నట్టు గుర్తించారు. దీంతో మీకు తెలియకుండానే మీ పర్సనల్ డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉంది. అందుకే శాంసంగ్ స్మార్ట్ మొబై ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్ చేసుకోవాలని సెర్ట్ ఇన్ కోరింది. శాంసంగ్ మొబైల్ ఫోన్లలో నాక్స్ ఫీచర్లపై కంట్రోలింగ్ లేదు. అలాగే ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలు, ఏఆర్ ఎమోజీ యాప్‌లో ఆథరైజేషన్ సమస్యలు ఉన్నాయి. నాక్స్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌లో సమస్యలను కరెక్ట్ చేయకపోవడం వల్లే ఈ ఇబ్బందులు తలెత్తాయని సెర్ట్-ఇన్ చెబుతోంది. ఈ లోపాలను అడ్డుపెట్టుకొని సైబర్ నేరగాళ్లు సెక్యూరిటీ ఫీచర్లను తొలగించి మీ మొబైల్స్‌లోని సెన్సిటివ్ డేటాను సేకరించే ప్రమాదం ఉంది. మీ మొబైల్ డివైజ్ పిన్, ఏఆర్ ఎమోజీ సాండ్‌బాక్స్ డేటాను కూడా నేరగాళ్ళు దొంగిలించే ఛాన్స్ ఉంది. సిస్టమ్ టైమ్ మార్చి నాక్స్ గార్డ్ లాక్‌ను బైపాస్ చేయొచ్చు.
బ్యాంకుల ఐడీ, పాస్ వర్డ్స్ లాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. శాంసంగ్ రీసెంట్‌గా రిలీజ్ చేసిన గెలాక్సీ S23, గెలాక్సీ Z Flip5, గెలాక్సీ Z Fold5తో పాటు ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 OSతో పని చేసే మొబైళ్ళు అన్నింటిలోనూ సెక్యూరిటీ లోపాలు ఉన్నాయి. అందుకే మీరు ఇప్పుడు మీ మొబైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి.. About deviceలో.. లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ ఇన్‌స్టాల్ చేసుకోవాలని సెర్ట్- ఇన్ సూచించింది. చాలామంది శాంసంగ్ మొబైల్‌ను అప్‌డేట్ చేసుకుంటే ఫోన్ రన్నింగ్ స్లో అవుతుందని చెబుతుంటారు. కానీ హ్యాకర్స్ నుంచి ఎదురయ్యే సవాళ్ళను దృష్టిలో పెట్టుకొని మొబైల్ తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోమని కోరుతుంటాయి. అందుకే భవిష్యత్‌లో ఇలాంటి ఇబ్బందుల బారిన పడకుండా ఎప్పటికప్పుడు ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బీ అలెర్ట్.. వెంటనే మీ శాంసంగ్ మొబైల్ అప్‌డేట్ చేయండి.