Astrology : జోతిష్యానికి బలయిన ఇల్లాలు..

ప్రపంచంలో ప్రతీదానికి హద్దు ఉండాలి.. నమ్మకానికి కూడా ! అది మనుషుల విషయంలో అయినా.. వస్తువుల విషయంలో అయినా.. విషయాల విషయంలో అయినా.. వాస్తు విషయంలో అయినా ! నమ్మి మోసం పోవడం వేరు.. నమ్మకంతో ఆందోళన పడి.. ఎవరికి వారు మోసం చేసుకోవడం వేరు. ఇలాంటి నమ్మకమే ఓ ఇల్లాలు ప్రాణం తీసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 9, 2024 | 02:49 PMLast Updated on: Jan 09, 2024 | 2:49 PM

Indira Nagar Hyderabad Is A Full Fledged Astrology

ప్రపంచంలో ప్రతీదానికి హద్దు ఉండాలి.. నమ్మకానికి కూడా ! అది మనుషుల విషయంలో అయినా.. వస్తువుల విషయంలో అయినా.. విషయాల విషయంలో అయినా.. వాస్తు విషయంలో అయినా ! నమ్మి మోసం పోవడం వేరు.. నమ్మకంతో ఆందోళన పడి.. ఎవరికి వారు మోసం చేసుకోవడం వేరు. ఇలాంటి నమ్మకమే ఓ ఇల్లాలు ప్రాణం తీసింది. యూట్యూబ్‌లో పరిచయం అయిన ఓ జోతిష్యుడు చెప్పిన మాటలు విని.. జరగకూడనిది జరుగుతుందని నమ్మి.. భర్తతో గొడవపడి.. చివరికి ప్రాణం తీసుకుంది. హైదరాబాద్‌ అంబర్‌పేటలో జరిగింది ఈ ఘటన. జోతిష్యంపై కొందరికి చాలా నమ్మకం ఉంటుంది. తిథి, నక్షత్రాలు, గ్రహాలు.. ఇలా ప్రతీదానిపై విశ్వాసం ఎక్కువ. ఇలా నమ్మడం తప్పు కాదు.. అదే నిజం అవుతుంది అనుకోవడం తప్పు అని ఎన్నిసార్లు చెప్పినా.. ఎలా చెప్పినా వాళ్లు వినరు. ఈ గృహిణి కూడా అంతే. బబితకు జ్యోతిషమంటే ఎంతో నమ్మకం. యూట్యూట్‌ ద్యారా తెలుసుకున్న జ్యోతిషం ప్రకారం.. ఆమె భర్తతో విడిపోతుందని బలంగా నమ్మింది. ఈ విషయం మీద తరచూ భర్తతో గొడవపడేది. ఓ రోజు భర్త కొట్టడంతో.. తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. అంబర్‌పేటకు చెందిన బబితకు.. ఐదేళ్ల కిందట రామకృష్ణతో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత వీరు కానాజిగూడ ఇందిరానగర్‌లో కాపురం పెట్టారు. బబిత, రామకృష్ణ దంపతులకు మూడేళ్ల బాబు ఉన్నాడు.

ఆదివారం కొడుకు పుట్టినరోజు వేడుకలు ఇంట్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు బంధుమిత్రులంతా వచ్చారు. బబిత తల్లిదండ్రులతో గొడవ కారణంగా హాజరుకాలేదు. సోమవారం ఉదయం భర్త ఆఫీసుకు వెళ్లాడు. తర్వాత రెండు గంటలకు అంగన్‌వాడీ కేంద్రం నుంచి వచ్చిన చిన్నారి.. తన తల్లి ఇంట్లో ఫ్యానుకు వేలాడుతుండటం చూసి కింది పోర్షన్‌లో ఉంటున్న బాబాయికి చెప్పాడు. వారు పైకి వెళ్లి చూసేసరికి ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందకు దించి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. జోతిష్యాన్ని గుడ్డిగా నమ్మొద్దని ఎన్నిసార్లు చెప్పినా బబితా వినేది కాదు. దీంతో భార్యభర్తల మధ్య గొడవలు అయ్యేవి. ఒక్కటి మాత్రం నిజం.. చేతిలో గీతలను చూసో.. గ్రహాల గమనాన్ని చూసే.. తిధులు, వారాలు చూసో.. భవిష్యత్‌ ఇది జరుగుతుందని ఎవరైనా చెప్తే.. గుడ్డిగా నమ్మొద్దు. నిజంగా అదే జరుగుతుందని అంచనా వేసే వాళ్ల జీవితాలు.. ఇంకోలా ఉండేవి. అందుకే మూఢనమ్మకాల మాయలో పడి.. ప్రాణాలు తీసుకోవద్దని మేధావులు సూచిస్తున్నారు.