Hardeep Singh Nijjar: నిజ్జర్ హత్య వెనక పాక్ ఐఎస్‌ఐ.. భారత్‌కు మరక అంటించే కుట్ర..
భారత్, కెనడా మధ్య సంబంధాలను దెబ్బతీసేందుకే.. నిజ్జర్‌ను ఐఎస్ఐ చంపేసి ఉంటుందని నిఘా వర్గాలు చెప్తున్నాయ్. భారత్ మీద కుట్రే కాదు.. మరో కారణం కూడా కనిపిస్తోంది. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ అయిన నిజ్జర్‌కు.. కెనడాలో ఉంటున్న పాక్ ఐఎస్‌ఐ నిఘా ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయ్.

Hardeep Singh Nijjar: భారత్, కెనడా ఉద్రికత్తలకు కారణమైన ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనక పాక్ ఐఎస్‌ఐ హస్తం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. భారత్‌ను దోషిగా చేయాలని ఐఎస్‌ఐ కుట్ర పన్ని ఉండొచ్చని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయ్. ఖలిస్థానీ సానుభూతిపరుడైన హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో.. భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయ్. ఇలాంటి పరిస్థితుల్లో నిజ్జర్ హత్యకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్.
ఈ ఘటనలో పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. నిఘా వర్గాల సమాచారం ఇదే అంటూ నేషనల్ మీడియాలో కీలక కథనాలు వస్తున్నాయ్. భారత్, కెనడా మధ్య సంబంధాలను దెబ్బతీసేందుకే.. నిజ్జర్‌ను ఐఎస్ఐ చంపేసి ఉంటుందని నిఘా వర్గాలు చెప్తున్నాయ్. భారత్ మీద కుట్రే కాదు.. మరో కారణం కూడా కనిపిస్తోంది. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ అయిన నిజ్జర్‌కు.. కెనడాలో ఉంటున్న పాక్ ఐఎస్‌ఐ నిఘా ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయ్. కెనడాకు వచ్చే తమ గ్యాంగ్‌స్టర్లకు పూర్తి మద్దతు ఇవ్వాలని.. ఐఎస్‌ఐ గత కొన్నేళ్లుగా నిజ్జర్‌పై ఒత్తిడి తెస్తోంది. ఐతే అతడు మాత్రం ఖలిస్థానీ నేతలకు అనుకూలంగా పనిచేస్తున్నాడు. స్థానికంగా పాపులారిటీ పెంచుకున్న నిజ్జర్.. డ్రగ్స్ అక్రమ దందాను నియంత్రిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అతడిపై కోపం పెంచుకున్న ఐఎస్‌ఐ.. నిజ్జర్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇద్దరు ఏజెంట్లకు ఈ బాధ్యతను అప్పగించినట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయ్.
కెనడాలో నిజ్జర్ ఉంటున్న ప్రాంతానికి చుట్టుపక్కల ఐఎస్‌ఐ మాజీ అధికారులు నివసిస్తున్నట్లు తెలిసింది. వీరిలో మేజర్ జనరల్స్ నుంచి హవల్దార్ స్థాయి అధికారులు ఉన్నారట. వీరి ద్వారానే నిజ్జర్ కదలికలను తెలుసుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది జూన్‌లో హర్‌దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా సాహిబ్ ప్రాంగణంలో గుర్తుతెలియని వ్యక్తులు అతడిని కాల్చి చంపారు. నిషేధిత ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్, గురునానక్ సిక్ గురుద్వారా సాహిబ్ అధిపతి అయిన హర్‌దీప్.. భారత్‌లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఒకడు. అతడి తలపై రూ.10లక్షల రివార్డు ఉంది. ఈ హత్య వెనక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు రాజుకున్నాయ్.