Tamil Nadu: ప్రియుడి కోసం అమ్మాయిని చంపిన ట్రాన్స్‌ జెండర్‌.. మతిపోగొట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ..

ఒక అబ్బాయిని ఇద్దరు అమ్మాయిలు ప్రేమించలేదు. ఓ అమ్మాయి అబ్బాయి కలిసి మరో అబ్బాయిని ప్రేమించారు. అది కూడా నార్మల్‌గా కాదు. వీళ్ల ప్రేమ వ్యవహారం అమ్మాయి ప్రాణం తీసేవరకూ వెళ్లింది. కన్ఫ్యూజింగ్‌గా ఉంది కదా.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 25, 2023 | 05:45 PMLast Updated on: Dec 25, 2023 | 5:45 PM

Jilted Lover Kills Tamil Nadu Techie Near Chennai In Tamil Nadu

Tamil Nadu: ఇదో ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ. ముగ్గురు వ్యక్తులకు.. ఒకరంటే ఒకరికి ఇష్టం. కానీ ఇక్కడ ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు ప్రేమించలేదు. ఒక అబ్బాయిని ఇద్దరు అమ్మాయిలు ప్రేమించలేదు. ఓ అమ్మాయి అబ్బాయి కలిసి మరో అబ్బాయిని ప్రేమించారు. అది కూడా నార్మల్‌గా కాదు. వీళ్ల ప్రేమ వ్యవహారం అమ్మాయి ప్రాణం తీసేవరకూ వెళ్లింది. కన్ఫ్యూజింగ్‌గా ఉంది కదా. అయితే, ఇది పూర్తిగా తెలుసుకోండి. చెన్నై సిరుసేరి సమీపంలో పొన్మార్‌ ప్రాంతంలో ఓ యువతి డెడ్‌బాడీ దొరికింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆ అమ్మాయి కాళ్లు చేతులు కట్టేసి సజీవదహనం చేశారు. తాళంపూర్‌ పోలీసులు బాడీని పోస్ట్‌ మార్టమ్‌కు పంపి.. స్పాట్‌లో తమకు దొరికిన క్లూస్‌ ద్వారా ఇన్వెస్టిగేట్‌ చేయడం ప్రారంభించారు.

Revanth Reddy: సీఎం రేవంత్‌కు అస్వస్థత.. ఖండించిన సీఎంవో

వాళ్ల ఇన్వెస్టిగేషన్‌లోనే ఈ ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ బయటపడింది. చనిపోయిన అమ్మాయి పేరు నందిని. చెన్నై పెరుంగుడిలోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తోంది. ఆమెను హత్య చేసింది ఆమె మాజీ ప్రియుడు వెట్రి మణిమారన్‌. చాలా కాలం వెట్రి మణిమారన్‌‌తో ప్రేమలో ఉన్న నందిని.. రీసెంట్‌గా అతన్ని కాదని రాహుల్‌ అనే అబ్బాయితో రిలేషన్‌లోకి వెళ్లింది. దీంతో వెట్రి మణిమారన్‌ నందినిని చంపేశాడు. తనను వదిలేసింది అన్న కోపంతో కాదు. నందిని ప్రేమిస్తున్న అదే రాహుల్‌ను.. వెట్రి మణిమారన్‌ కూడా ప్రేమిస్తున్నాడు. షాక్‌ అయ్యారా.. మీరు విన్నది నిజమే. ఈ వెట్రి మణిమారన్‌ అబ్బాయి కాదు ట్రాన్స్‌జెండర్‌. అతని అసలు పేరు మహేశ్వరి. కానీ అబ్బాయిగా మారాడు. ఈ విషయం తెలియక నందిని.. మణిమారన్‌ను ప్రేమించింది. కొన్ని రోజుల తరువాత మణిమారన్‌ అబ్బాయి కాదు అమ్మాయి అని నందినికి అర్థమయ్యింది. దీంతో అతన్ని వదిలేసింది. అప్పటికే రాహుల్‌ అనే వ్యక్తితో నందినికి పరిచయం ఉంది. ఇద్దరి అభిప్రాయాలు ఒక్కటవ్వడంతో నందిని, రాహుల్‌ ప్రేమించుకోవడం ప్రారంభించారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్‌ తలెత్తింది.

వెట్రి మణిమారన్‌కు కూడా రాహుల్‌ అంటే చాలా ఇష్టం. దీంతో రోజూ అతనితో మాట్లాడేవాడు మణిమారన్‌. తన ప్రేమగురించి కూడా చెప్పి ఒప్పుకోవాలని రాహుల్‌ను కోరేవాడు. ఈ విషయం తెలిసిన నందిని మణిమారన్‌ను మందలించింది. తమ మధ్యలో రావొద్దంటూ చెప్పింది. ఇదే విషయంలో మణిమారన్‌కు నందినికి చాలాసార్లు గొడవ కూడా జరిగింది. నందిని లేకపోతేనే రాహుల్‌ తనకు దక్కుతాడు అనుకున్న మణిమారన్‌.. నందినిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. మాట్లాడే పని ఉందంటూ పిలిచి నందిని కాళ్లు చేతులూ కట్టేసి.. పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. నందిని లేకపోతే రాహుల్‌ దక్కుతాడు అనుకున్నాడు కానీ.. నందినిని చంపితే హంతకుడిగా జైలుకు వెళ్తాడు అనే లాజిక్‌ మాత్రం మర్చిపోయాడు. చెన్నైలో ఇప్పుడు వీళ్ల ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరి పెద్ద హాట్‌ టాపిక్‌గా మారింది. వెట్రి మణిమారన్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.