Kerala: కాపురంలో చిచ్చుపెట్టిన ట్రాఫిక్ చలాన్.. ప్రేయసితో దొరికిపోయిన భర్త!

కేరళలోని ఇదుక్కిలో ఈ ఘటన జరిగింది. ఒక వ్యక్తి తన భార్యకు తెలియకుండా మరో మహిళతో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఒక రోజు తన ప్రేయసిని తీసుకుని బైకుపై ఎంచక్కా తన ప్రేయసితో షికారుకెళ్లాడు. అయితే, అప్పుడు వాళ్లు హెల్మెట్ పెట్టుకోలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 11, 2023 | 12:46 PMLast Updated on: May 11, 2023 | 12:46 PM

Kerala Man Faces Divorce After Getting Challan For Not Wearing Helmet

Kerala: తన భార్యకు తెలియకుండా ప్రేయసితో రహస్యంగా సాగిస్తున్న బంధాన్ని బయటపడేలా చేసింది ట్రాఫిక్ చలాన్. దీంతో తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఒక మహిళ. బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోవడమే ఈ విషయంలో అతడు చేసిన పొరపాటు. కేరళలోని ఇదుక్కిలో ఈ ఘటన జరిగింది.

ఒక వ్యక్తి తన భార్యకు తెలియకుండా మరో మహిళతో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఒక రోజు తన ప్రేయసిని తీసుకుని బైకుపై ఎంచక్కా తన ప్రేయసితో షికారుకెళ్లాడు. అయితే, అప్పుడు వాళ్లు హెల్మెట్ పెట్టుకోలేదు. మెయిన్ రోడ్డుపై హెల్మెట్ లేకుండా బైకుపై ఈ జంట వెళ్తుండటాన్ని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు, ఫొటో తీశారు. దీనికి సంబంధించిన చలాన్‌ను బైక్ రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నెంబర్‌కు పంపారు. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆ బైకు అతడి భార్య పేరు మీద రిజిష్టర్ అయి ఉంది. దీంతో చలాన్ మెసేజ్ కూడా ఆమె మొబైల్‌కే వెళ్లింది. ఆ చలాన్‌పై క్లిక్ చేయగా భర్త తన బైకుపై మరో మహిళతో వెళ్తున్న ఫొటో కనిపించింది. దీంతో భర్త సాగిస్తున్న వివాహేతర బంధం బయటపడింది. ఈ విషయంపై ఆమె భర్తను ప్రశ్నించింది.

మొదట తప్పించుకునేందుకు ఏవేవో చెప్పినప్పటికీ, చివరకు నిజం ఒప్పుకోకతప్పలేదు. దీంతో ఈ విషయం ఇద్దరి మధ్యా గొడవలకు దారి తీసింది. అనుమానం పెనుభూతం అన్నట్టు.. రోజు రోజుకీ వాళ్ళ మధ్య గొడవలు పెరిగాయి. కొంత కాలం భార్య గొడవ భరించిన భర్త చివరకు ఆమె మీద చేయి చేసుకున్నాడు. వేరే అమ్మాయితో బైక్ మీద వెళ్లడమే కాకుండా చేయి చేసుకోవడం ఆ భార్య తట్టుకోలేకపోయింది. వెంటనే భర్తపై గృహ హింస కేసు పెట్టింది. పోలీస్‌లు అతన్ని అరెస్ట్ చేసారు. ఇలా హెల్మెట్ లేకుండా బయటికి వెళ్లడం ఓ కాపురాన్ని కూల్చింది.