KTM PANDU: బెజవాడలో పేట్రేగిపోతున్న పండు గ్యాంగ్.. సీపీగారు.. కళ్లు తెరవండి ప్లీజ్..
గ్యాంగ్‌వార్‌లో ప్రాణాలు కోల్పోయిన సందీప్‌తో పండుకు జరిగిన వివాదంతోనే.. రచ్చ మొదలైంది. పెనమలూరు పీఎస్‌లో పండు మీద రౌడీషీట్ ఓపెన్ అయింది. ఐనా సరే మారడం లేదు కదా.. మరింత రెచ్చిపోతున్నాడు.
KTM PANDU: పండుగాడు.. బెజవాడను గజగజలాడిస్తున్నాడు. పోలీసులకే సవాల్‌గా మారుతున్నాడు. ఎన్ని కేసులు పెట్టినా.. ఎన్నిసార్లు జైలుకు పంపినా.. పండు అండ్ గ్యాంగ్ తీరు మారడం లేదు సరికదా.. మరింత పేట్రేగిపోతున్నారు. పోలీసులను కూడా ఈ గ్యాంగ్ బెదిరిస్తోందంటే అర్థం చేసుకోవచ్చు.. అరాచకం ఏ లెవల్‌లో ఉందో అని ! మూడేళ్ల కింద.. బెజవాడలో కలకలం రేపిన పటమట గ్యాంగ్‌వార్ ఘటనలో పండు ప్రధాన నిందితుడు. అసలీ ఘటన జరగడానికి ప్రధాన కారణమే పండు. గ్యాంగ్‌వార్‌లో ప్రాణాలు కోల్పోయిన సందీప్‌తో పండుకు జరిగిన వివాదంతోనే.. రచ్చ మొదలైంది.
పెనమలూరు పీఎస్‌లో పండు మీద రౌడీషీట్ ఓపెన్ అయింది. ఐనా సరే మారడం లేదు కదా.. మరింత రెచ్చిపోతున్నాడు. రౌడీషీట్ ఉన్నా.. పోలీసులతో ఉన్న సంబంధాలతో.. రౌడీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడని లోకల్‌టాక్. దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రైవేట్ పంచాయితీలతో.. పోలీసులకు కొరకరాని కొయ్యగా పండు తయారయ్యాడని తెలుస్తోంది. ఈనెల 25న ఉయ్యూరులో మరో దాడికి పాల్పడ్డారు పండు అండ్ గ్యాంగ్. ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లలో.. ఓ యువకుడిపై బీరు సీసాతో దాడి చేసి కలకలం సృష్టించారు. ఉజ్వల్ అనే వ్యక్తి.. పండును జాతరకు పిలిచాడు. మద్యం మత్తో.. మరో కారణమో కానీ.. ఇద్దరి మధ్యా గొడవ జరగగా.. సంతోష్ అనే యువకుడు మధ్యలో వెళ్లాడు. సంతోష్‌ను తోసేసిన పండు.. బీర్‌సీసాతో తల పగలకొట్టి.. మొహం మీద పొడిచాడు. ఈ ఘటనలో సంతోష్ పెదాలు, దవడకు తీవ్ర గాయాలయ్యాయ్. దాడి తర్వాత.. పండుతో పాటు అతని గ్యాంగ్ అక్కడ నుంచి పరారయ్యారు. ఈ కేసులో పండు సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
సంతోష్ కుటుంబ సభ్యులను పండు తల్లి కలిశారు. కిందపడితే సంతోష్‌కు గాయాలయ్యాయని చెప్పాలని, అసలు విషయం పోలీసులకు చెప్పొద్దంటూ.. ఆమె కోరినట్లుగా తెలుస్తోంది. ఇతే అటు విజయవాడలో రౌడీ యాక్టివిటీస్‌తో పాటు.. పోలీసులను కూడా బెదిరించే విధంగా.. పండు అండ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. పండు ఆగడాలపై దృష్టి సారించి.. పోలీసులు చర్యలు తీసుకోవాలని బెజవాడవాసులు కోరుతున్నారు. పండు అండ్ గ్యాంగ్‌ను నగర బహిష్కరణ చేస్తే ఆగడాలకు అడ్డుకట్ట పడే అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నారు. సీపీగారు కళ్లు తెరవండి ప్లీజ్ అంటూ విన్నవించుకుంటున్నారు స్థానిక ప్రజలు.