Lasya Nanditha: గన్‌మెన్ లేడు.. ప్రభుత్వ వాహనం వాడలేదు.. పటాన్‌చెరు ఎందుకెళ్లినట్లు..?
లాస్య ప్రయాణించిన మారుతీ సుజుకీ ఎక్స్‌ఎల్6 కారుకి సేఫ్టీ రేటింగ్ తక్కువగా ఉంది. అది తెలిసి కూడా వారు అంత వేగంతో ఎందుకు ప్రయాణించాల్సి వచ్చిందన్నది అర్థం కావడం లేదు. ఇక లాస్య ఘటనలో చాలా అనుమానాలు తెరమీదకు వస్తున్నాయ్.
Lasya Nanditha: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణం.. తెలుగు రాష్ట్రాలను షాక్‌కు గురి చేసింది. తెలంగాణ రాజకీయ నేతలు మాత్రమే కాకుండా.. ఏపీ లీడర్లు కూడా లాస్యకు నివాళి తెలుపుతున్నారు. సాయన్న స్నేహితులు, రాజకీయ పరిచయస్తులు అంతా.. ఇప్పుడు లాస్య నందిత ఇంటికి క్యూ కడుతున్నారు. లాస్య నందిత పోస్టుమార్టంలో సంచలన విషయాలు బయటకు వచ్చాయ్. కాలు విరిగిపోయి, పళ్లు ఊడిపోయి.. పక్కటెముకలు ముక్కలై.. చివరి క్షణాల్లో లాస్య ఎంతలా అల్లాడిపోయిందనే ఊహే.. కన్నీళ్లు ఆగకుండా చేస్తోంది.
YS JAGAN HELICOPTERS: జనం సొమ్ముతో సోకులు.. 4 కోట్లతో రెండు హెలికాప్టర్లు.. జగన్‌పై ఈసీకి కంప్లయింట్
కారు ప్రమాదానికి అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ప్రమాదం జరిగిన సమయంలో లాస్య నందిత సీటు బెల్టు పెట్టుకోలేదని కూడా తెలిసింది. దీంతో గాయాలు బలంగా తగిలాయ్. దీంతో స్పాట్‌లోనే చనిపోయిది. సీటు బెల్ట్ పెట్టుకుని ఉంటే.. గాయాలతో బయటపడే చాన్స్ ఉండేది. ఇక లాస్య ప్రయాణించిన మారుతీ సుజుకీ ఎక్స్‌ఎల్6 కారుకి సేఫ్టీ రేటింగ్ తక్కువగా ఉంది. అది తెలిసి కూడా వారు అంత వేగంతో ఎందుకు ప్రయాణించాల్సి వచ్చిందన్నది అర్థం కావడం లేదు. ఇక లాస్య ఘటనలో చాలా అనుమానాలు తెరమీదకు వస్తున్నాయ్. లాస్య కుటుంబసభ్యులు గురువారం రాత్రి సదాశివపేట మండలం కొనాపూర్‌లోని మిస్కిన్ బాబా దర్గాకి వచ్చారు. ఆ తర్వాత కాసేపటికే డ్రైవర్ ఆకాష్‌తో కలిసి లాస్య కూడా దర్గాకి వచ్చారు. లాస్య కుటుంబం అంతా రాత్రి పన్నెండున్నరకు దర్గాలో పూజలు చేసి వెళ్లిపోయారు. మొక్కులు తీర్చుకున్న తర్వాత.. 3 నుంచి 4 గంటల మధ్య లాస్య బయల్దేరిందని చెప్తున్నారు. ఐతే తిరిగి ఇంటికి రాకుండా.. పటాన్‌చెరు వైపు లాస్య ఎందుకు వెళ్లారు అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక అటు ఎమ్మెల్యేకు ప్రొటోకాల్ ఉంటుంది. గన్‌మెన్ ఉంటారు. ఐతే ప్రమాద సమయంలో మాత్రం కారులో ఇద్దరే ఉన్నారు. అసలు లాస్య ప్రయాణిస్తున్న కారులో గన్‌మెన్ ఎందుకు లేడు. ఇదంతా ఎలా ఉన్నా.. అసలు ప్రభుత్వ వాహనం పక్కనబెట్టి.. లాస్య ఆ కారులో ఎందుకు ప్రయాణించాల్సి వచ్చింది..? ఆ కారులో కాకుండా.. మరే వాహనంలో ట్రావెల్ చేసినా.. ప్రమాద తీవ్రత తగ్గి ఉండేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. అసలు దర్గా నుంచి వెళ్లి పోయిన తర్వాత.. ఉదయం ప్రమాదం జరిగినంత వరకు.. మధ్యలో ఏం జరిగిందనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.