Lasya Nanditha: లాస్య నందిత డ్రైవర్ ఎక్కడ.. ఆకాశ్ ఏం చెప్పి ఆమెను తీసుకెళ్లాడు..
దర్గా నుంచి వెళ్లిన తర్వాత ప్రమాద ఘటనకు మధ్యలో.. ఆ ఐదు గంటలు ఎక్కడికి వెళ్లారు.. ఏం చేశారు.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయ్. లాస్య మరణం వెనక ఏం జరిగింది.. ప్రమాదానికి అసలు కారణం ఏంటి..?
Lasya Nanditha: ఒక్క మరణం.. వంద ప్రశ్నలు.. ఎమ్మెల్యే లాస్య నందిత ఘటనలో కనిపిస్తున్న పరిణామాలు.. ఎన్నో అనుమానాలు వినిపించేలా చేస్తున్నాయ్. కుటుంబం వెళ్లిన తర్వాత దర్గాకు ఆకాశ్‌తో కలిసి ఎందుకు వెళ్లారు. తర్వాత ఫ్యామిలీతో కాకుండా.. పీఏను కలిసి ఎందుకు బయల్దేరినట్లు.. ఇంటికొచ్చే దారి కాకుండా.. పటాన్‌చెరు వైపు ఎందుకు వెళ్లారు.. ఇలా చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయ్ లాస్య వ్యవహారంలో! ఇంతకీ ఆ డ్రైవర్ ఎక్కడ.. గన్‌మెన్‌లను ఎందుకు వద్దన్నారు.. దర్గా నుంచి వెళ్లిన తర్వాత ప్రమాద ఘటనకు మధ్యలో.. ఆ ఐదు గంటలు ఎక్కడికి వెళ్లారు.. ఏం చేశారు.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయ్.
Mahesh Babu: మహేష్ బాబాయ్‌కి టిక్కెట్.. ప్రచారానికి సూపర్ స్టార్ వస్తాడా..?
లాస్య మరణం వెనక ఏం జరిగింది.. ప్రమాదానికి అసలు కారణం ఏంటి.. అంత వేగంగా వెళ్లాల్సిన అవసరం ఎందుకొచ్చింది.. ఇలా చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. దర్గాలో పూజలు చేసిన తర్వాత.. డ్రైవర్, ఇద్దరు గన్‌మెన్‌లను వదిలేసి.. పీఏ ఆకాశ్‌తో కలిసి లాస్య ఎక్కడికి వెళ్లిందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. రాత్రి పన్నెండున్నర నుంచి ఉదయం ఐదున్నర మధ్య.. వాళ్లు ఎక్కడున్నారనే విషయంపై ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు లాస్యనందిత కారు డ్రైవర్ ఎక్కడున్నాడు.. ఈ ఘటన మీద ఎందుకు మాట్లాడడం లేదు.. అందుబాటులోనే ఉన్నాడా.. లేదంటే మరేదైనా కారణం ఉందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయ్. శుక్రవారం ఉదయం ఐదున్నరకు ప్రమాదం జరిగింది. మరి యాక్సిడెంట్ ముందు వరకు.. లాస్యనందిత, ఆమె పీఏ ఆకాశ్ ఎక్కడ అన్నది ఇప్పుడు భారీ ప్రశ్న. అసలు గన్‌మెన్‌లు, డ్రైవర్, ఎమ్మెల్యే వాహనాన్ని వదిలేసి.. అసలు సేఫ్టీ లేని మారుతి ఎక్సెల్ కారులో వెళ్లాల్సిన అవసరమేంటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. పీఏ ఆకాష్‌తో కలిసి దర్గా నుంచి లాస్య వెళ్లిపోయారు.
డ్రైవ్ చేసుకుంటూ ఇద్దరు ఎటు వెళ్లారు.. డ్రైవర్‌ను కాదని.. గన్‌మెన్‌లను వద్దని బయటకెళ్ళిన లాస్య, ఆకాష్.. మిడ్‌నైట్ ప్రైవేట్ పార్టీకి అటెండ్ అయ్యారా.. లేదంటే లేట్ నైట్ డ్రైవ్‌కి వెళ్లారా.. ఇవీ కాకపోతే.. అసలు ఆ ఐదు గంటలు ఏం చేసినట్లు.. ఇలా రకరకాల కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అసలు ఎవరికీ సమాచారం లేకుండా.. అర్ధరాత్రి నుంచి పొద్దున వరకు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది.. పీఏ ఆకాశ్‌ను మాత్రమే లాస్య ఎందుకు తీసుకెళ్లారు.. ఈ కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎంక్వైరీలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయ్. యాక్సిడెంట్ వెనక, మరణం వెనక అసలు కారణాలు బయటపడే చాన్స్ ఉంది. ఏమైనా ఎంతో భవిష్యత్ ఉన్న లాస్య నందిత.. ఇలా అకాల మరణం చెందడం.. ప్రతీ ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తోంది.