నడిరోడ్డుపై.. అంతా చూస్తుండగా లాయర్ దారుణ హత్య
హైదరాబాద్ సంతోష్ నగర్‌లో దారుణ ఘటన జరిగింది. న్యూ మారుతి నగర్ కాలనీలో అంతా చూస్తుండగా నడి రోడ్డుపై లాయర్ ఇజ్రాయెల్‌ను హత్య చేశాడు దస్తగిరి అనే వ్యక్తి. స్థానికంగా దస్తగిరి ఎలక్ట్రిషన్‌గా పని చేస్తున్నాడు.

హైదరాబాద్ సంతోష్ నగర్‌లో దారుణ ఘటన జరిగింది. న్యూ మారుతి నగర్ కాలనీలో అంతా చూస్తుండగా నడి రోడ్డుపై లాయర్ ఇజ్రాయెల్‌ను హత్య చేశాడు దస్తగిరి అనే వ్యక్తి. స్థానికంగా దస్తగిరి ఎలక్ట్రిషన్‌గా పని చేస్తున్నాడు. రీసెంట్‌గా దస్తగిరి తనను వేధించాడంటూ ఓ మహిళ ఇజ్రాయెల్ దగ్గరకు వచ్చింది.
ఈ వ్యవహారంలో దస్తగిరిపై చర్యలు తీసుకోవాలంటూ ఇజ్రాయెల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతే కాకుండా ఆ కేసును తానే స్వయంగా టేకప్ చేశాడు. తనపై కేసు పెట్టాడన్న కోపంతో ఇజ్రాయెల్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు దస్తగిరి. ఇజ్రాయెల్ బైక్ మీద వెళ్తున్న సమయంలో కత్తితో ఎటాక్ చేశాడు. తీవ్రంగా గాయపడ్డ లాయర్‌ను స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ లాయర్ ఇజ్రాయెల్ చనిపోయాడు. దీంతో దస్తగిరిని పోలీసులు అరెస్ట్ చేశారు.