Tirupati Zoo Park: తిరుపతి జూపార్క్‌లో విషాదం.. మనిషిని చంపిన సింహం..
ఒక వ్యక్తి సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లి ఎన్‌క్లోజర్‌లో చిక్కుకుపోయాడని, సింహాన్ని చూడటంతో చెట్టు పైకి ఎక్కినట్లు తెలుస్తోంది. చెట్టుపైకి ఎక్కి కేకలు వేశాడు. తర్వాత చెట్టు పైనుంచి కింద పడటంతో సింహం అతడిపై దాడి చేసి, చంపి తినేసింది.

Tirupati Zoo Park: తిరుపతి ఎస్వీ జూ పార్కులో గురువారం విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిపై సింహం దాడి చేసి చంపేసింది. లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తిని చంపి, తల భాగాన్ని పూర్తిగా తినేసింది. ఈ ఘటనపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
YS JAGAN: చంద్రబాబు వస్తే చంద్రముఖి మళ్లీ వస్తుంది.. వలంటీర్లు భావి లీడర్లు: వైఎస్ జగన్
ఒక వ్యక్తి సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లి ఎన్‌క్లోజర్‌లో చిక్కుకుపోయాడని, సింహాన్ని చూడటంతో చెట్టు పైకి ఎక్కినట్లు తెలుస్తోంది. చెట్టుపైకి ఎక్కి కేకలు వేశాడు. తర్వాత చెట్టు పైనుంచి కింద పడటంతో సింహం అతడిపై దాడి చేసి, చంపి తినేసింది. మరోవైపు మరణించిన వ్యక్తిని రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుల్జార్‌గా అధికారులు గుర్తించారు. అతడు మద్యం సేవించి ఉన్నాడా.. ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని రుయా ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై జూ అధికారులను పోలీసులు ఆరా తీస్తున్నారు. సింహం దాడిలో మరణించిన వ్యక్తి మద్యం మత్తులో లయన్ ఎన్‌క్లోజర్‌లోకి దూకడంతో ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితుడు ఒంటరిగానే పార్కుకు వచ్చినట్లు తెలిసింది. ఈ ఘటనపై విచారణ తర్వాతే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.