Madhya Pradesh: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 11 మంది మృతి.. 60 మందికి గాయాలు..
భారీ స్థాయిలో బాణసంచా నిల్వ ఉండటంతో తీవ్ర అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ పేలుడు ప్రభావం ఎంత ఉందంటే.. చుట్టుపక్కల ఉన్న ఇండ్ల కిటికీలు, అద్దాలు వంటివి కూడా పగిలిపోయాయి. పేలుడు తీవ్రతకు అక్కడ ప్రకంపనలు కూడా వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. ఒక బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించడంతో 11 మంది మరణించారు. మరో 60 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్, హర్దా జిల్లాలో మంగళవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో జరిగింది. బైరగర్ పట్టనంలోని మగర్ధ రోడ్డులో ఒక బాణసంచా తయారీ కేంద్రం ఉంది. దీన్ని అక్రమంగా నిర్వహిస్తున్నారు. ఉదయం ఈ కర్మాగారంలో పేలుడు సంభవించింది. భారీ స్థాయిలో బాణసంచా నిల్వ ఉండటంతో తీవ్ర అగ్నిప్రమాదం సంభవించింది.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ కోసం రంగంలోకి దిగుతున్న ప్రభాస్ హీరోయిన్
ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ పేలుడు ప్రభావం ఎంత ఉందంటే.. చుట్టుపక్కల ఉన్న ఇండ్ల కిటికీలు, అద్దాలు వంటివి కూడా పగిలిపోయాయి. పేలుడు తీవ్రతకు అక్కడ ప్రకంపనలు కూడా వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో కర్మాగారంలో పని చేస్తున్న చాలా మంది గాయపడ్డారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. మొత్తం 11 మంది మరణించగా, 60 మందికిపైగా గాయపడ్డారు. తీవ్ర గాయాలపాలైన చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు.. ఇండోర్, భోపాల్ నుంచి అగ్నిమాపక యంత్రాల్ని తెప్పించి, మంటల్ని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో లోపల ఇంకా కొందరు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పందించారు. బాధితులకు చికిత్స అందించేందుకు ఇందౌర్, భోపాల్‌లోని అన్ని ప్రధాన ఆస్పత్రులతోపాు ఎయిమ్స్‌లో కూడా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద స్థలికి దాదాపు 50 అంబులెన్సుల్ని పంపించారు.
మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దాదాపు 400 మంది పోలీసులు అక్కడ భద్రతా చర్యల్లో ఉంటూ, సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇంకా క్షతగాత్రులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.4 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి ఉచితంగా శిక్షణ అందిస్తామని సీఎం ప్రకటించారు. అయితే, ఈ అగ్ని ప్రమాద ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.