Aparna Nair: సీరియల్ నటి అనుమానాస్పద మృతి..
మలయాళ నటి అపర్ణా నాయర్ తన ఇంట్లో శవమై కనిపించింది. 31 ఏళ్ల అపర్ణ హఠాన్మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. మరణానికి ముందు అపర్ణ నాయర్ తన చిన్న కుమార్తె అందమైన ఫోటో, వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. వీడియోకు బ్యాక్ గ్రౌండ్‌గా ఓ లాలిపాటను జోడించింది.

Aparna Nair: మలయాళ నటి అపర్ణా నాయర్ తన ఇంట్లో శవమై కనిపించింది. 31 ఏళ్ల అపర్ణ హఠాన్మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె మరణానికి కొన్ని గంటల ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో తన చివరి పోస్ట్‌ను పంచుకుంది. అందులో ఆమె తన కుమార్తెపై ప్రేమను కురిపించింది. ప్రస్తుతానికి అపర్ణ మృతికి కారణాలు తెలియరాలేదు. అపర్ణ మృతితో ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖులు అందరూ షాక్‌కు గురయ్యారు.
తిరువనంతపురంలోని తన ఇంట్లో అపర్ణ ఉరివేసుకుని కనిపించింది. దీంతో వెంటనే గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. ఆమె అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. పోలీసులు దీన్ని అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు. మరణానికి ముందు అపర్ణ నాయర్ తన చిన్న కుమార్తె అందమైన ఫోటో, వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. వీడియోకు బ్యాక్ గ్రౌండ్‌గా ఓ లాలిపాటను జోడించింది. మేరి ఉన్ని, ఉల్లాసభరితమైన చిన్నది అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. అపర్ణ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆమె భర్త , ఇద్దరు కుమార్తెలతో సంతోషంగా ఉన్న ఫోటోలు, వీడియోలతో నిండి ఉంది. చందనమఝ, ఆత్మసఖి, మైథిలీ వీందుం వరుమ్, దేవస్పర్శమ్ వంటి టీవీ షోలలో నటించిన అపర్ణనాయర్ మంచి పేరు తెచ్చుకుంది.
మేఘతీర్థం, ముత్తుగౌ, అచ్చయన్స్, కోదాటి సమక్షం బాలన్ వాకిల్, కల్కి వంటి చిత్రాల్లో కూడా నటించింది. అపర్ణకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం తర్వాత మృతికి కారణాలు తెలిసే అవకాశం ఉంది. మరోవైపు కుటుంబ తగాదాల కారణంగానే అపర్ణ ఆత్మహత్య చేసుకుని ఉంటుందని సన్నిహితులు చెప్తున్నారు.