Male Escorts: సిటీలో కాల్ బాయ్స్ కు ఫుల్ డిమాండ్..!

ఏదైనా నూతన ఒరవడికి పెట్టింది పేరు హైదరాబాద్. అసలే కోటికి పైగా జనాభా. అతడు సినిమాలో కోటా నోట ఒక డైలాగ్ వస్తుంది. హైదరాబాద్ బాగా డెవలప్ అయిపోయింది. ఏమికావాలన్నా ఇట్టే దొరికేస్తుంది అని. ఆ మాట ఇప్పుడు నిజమే ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని దశాబ్దాల క్రితం పేపర్ బాయ్స్, మిల్స్ బాయ్స్ గురించి విన్నాం. గతంలో ఫుడ్ డెలివరీ బాయ్స్ ని చూశాం. తాజాగా వచ్చేశారు కాల్ బాయ్స్. అంటే కాల్ చేయంగానే వచ్చేస్తారా.. అనే ప్రశ్న మీలో కలుగక మానదు. వాటన్నింటికీ సరైన సమాధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 27, 2023 | 08:24 PMLast Updated on: Feb 28, 2023 | 12:02 PM

Male Escorts Culture In Hyderabad

ఇది 21వ శతాబ్దం. అందులోనూ రంగురంగుల ప్రపంచం. లోకంలో చాలా మంది చేతిల్లో డబ్బులు ఉన్నాయని లాక్ డౌన్ రుజువుజేసింది. పనిలేదు.. బయటకు పోలేదు. ఇంట్లో దీపాలు వెలిగించుకుంటూ.. చప్పట్లు కొడుతూ దాదాపు అర్థ సంవత్సరం గడిపేశాము. బీద బిక్కి పేగులు ఎండి, గుండెలు మండి చనిపోయారనుకోండి అది వేరే విషయం. కొందరు సంపన్నులు మాత్రం డబ్బులెక్కువై వింత పోకడలకు పోతున్నారు. పూర్వం ఒక మాట అనేవారు. వినాశకాలే విపరీత బుద్దిహి: అని. వినాశనం అయితే చూడలేదు కానీ విపరీత బుద్ది అయితే మర్రి చెట్టు వేర్లలాగా విస్తరించింది. అలా విస్తరించిన వాటిలో ఒకటి కాల్ బాయ్స్ కల్చర్. దీనికి కూడా ఒక వయోపరిమితి ఉంది. భారతదేశంలో ప్రతిదానికి వయోపరిమితి ఉంటుంది. అందుకే నిరుద్యోగం ‎ఎక్కువ. చదువుకున్న చదువుకు ఉద్యోగం రాదు. ఉద్యోగానికి అవసరమైన చదువుకోసం కోర్సులు పేరిట కాలం, వ్యయం ఖర్చు చేస్తాడు. దీంతో ఉద్యోగానికి వయస్సు అయిపోయి నిరుద్యోగిగా మిగులుతాడు. ఇలా మిగిలిపోయిన వాడికి సోషల్ మీడియా ఆశ్రయం కల్పిస్తుంది. అదే కాల్ బాయ్స్ సైట్స్.

అవకాశాల పేరుతో అసాంఘీక ఊబిలో:
ఈ సైట్స్ లో గంట సేపు ఒకరితో గడిపితే వేలకు వేలు ఇస్తామని రహస్య ప్రకటనలను చూపిస్తారు. దీంతో అతని అవకాశానికి ఎరేసి, ఆశను చూపించి ఈ ఊబిలోకి దించుతారు. ఒక్కసారి రక్తానికి రుచి మరిగిన మృగం పచ్చి ఆకులు తింటుందా.. అలాగే ఈ కాల్ బాయ్స్ పరిస్థితి. ఉదరనిమిత్తం బహుకృత వేషం అని జగద్గురు శంకరులు అన్నట్లు పోట్ట కూటికోసం ఇంతటి దారుణానికి ఒడిగడుతున్నారు. ఇందులో చాలా వరకూ కాల్ బాయ్స్ కోసం ఆసక్తి చూపుతున్నది
ఇండస్ట్రియల్, రియల్ ఎస్టేట్, కన్ స్ట్రక్షన్, సాఫ్ట్ వేర్, సినిమా రంగాల్లోని మహిళలు మాత్రమే అని ప్రచారం జోరుగా సాగుతోంది. అంటే వీరికి కుటుంబాలు ఉండవా.. సంసారం చేయరా అంటే అన్నీ ఉంటాయి అల్లుడి నోట్లో శని అనే సామెతను అన్వయం చేసుకోవాల్సి వుంటుంది. ప్రస్తుతం అందరూ తమ తమ వృత్తి వ్యాపారాల్లో డబ్బు డబ్బు అంటూ తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ అనే నినాదాన్ని అన్వయించుకొని. వీరి గుండె చప్పుడు కూడా లబ్ డబ్ అని కాకుండా డబ్బు డబ్బు అని కొట్టుకుంటుందేమో బహుశా.

వివాహేతర సంబంధానికి సరికొత్త మార్గం:
ఇలా బిజీ బిజీగా గడిపేస్తున్న భర్తలు తమ భార్యలకు సమయాన్ని కేటాయించడంలో విఫలం అవుతున్నారు. ఇదే అదునుగా భావించిన ఈ కాల్ బాయ్స్ యాప్స్ నిర్వహణా సంస్థలు వారికి ఆకర్షించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇంకేముంది. మీకు కావల్సింది మా దగ్గర ఉంది అనేలా వాతావరణం మారిపోయింది. ఇక సాప్ట్ వేర్ ఉద్యోగుల విషయంలో అయితే భర్త ఒకచోట భార్య ఒక చోట వేరు వేరుగా ఉంటారు. దీంతో వయసు రిత్యా ఎదురయ్యే కోరికలను, వయసు తాపాన్ని తీర్చేందుకు తమ భర్తలు అందుబాటులో ఉండరు. అది వారి తప్పు కాదు వారి వయస్సుది. దీంతో పరాయి మగాడి వ్యామోహంలో పడేందుకు ప్రయత్నం చేస్తారు. అలా మగాడిని ఎన్నుకునే క్రమంలో కొందరు తమ సమీపంలో ఉన్న అందుబాటులో ఉన్న వారిని ఎంచుకొని వివాహేతర సంబంధం పెట్టుకుంటే వారి పరువుపోయే ప్రమాదం ఉంది. అలాగే దీని వల్ల వచ్చే తలనొప్పులు మామూలుగా ఉండవు. అందుకే వీరు ప్రత్యేకంగా ఒక యాప్ ద్వారా వారికి కావల్సిన గుణ,గణాలతో సెలెక్ట్ చేసుకుంటారు. దీనికి మేల్ ఎస్కార్ట్ సర్వీసెస్ అంటూ నామకరణం చేశారు. దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంది వైవాహిక జీవితంలో సుఖాన్ని పొందలేని మహిళలు, కొత్త రుచిని కోరుకునే ప్రియులు, పెళ్లి చేసుకొని భర్తను విడిచి ఒంటరిగా ఉన్న వారు, వయస్సు పైబడి పెళ్లి కాని వారు, పిల్లలు పెళ్లి, సంసారం, కుటుంబం అనే పెద్ద సాగరాన్ని ఈదలేక బయపడే వారు వీటిని ఎంచుకుంటున్నారు. ఇందులో అయితే తమకు కావల్సినంత సేపు శారీరక సుఖాన్ని అనుభవించి తగిన డబ్బును చెల్లించి తిరిగి హాయిగా తమ పనిని చేసుకుంటున్నారు.

male escorts culture in hyderabad

male escorts culture in Hyderabad

సర్కార్ కొలువులకు మించిన నిబంధనలు:
ఈ మెయిల్ ఎస్కార్ట్ బాయ్స్ ద్వారా పిలిపించుకునే వారికి కూడా చాలా కండీషన్లు ఉన్నయి సుమా. ఉత్తినే ఎవరు పడితే వారు ఇందులో పాల్గోనలేరు. ఎవరు పడితే వారు బుక్ చేసుకోనూ లేరు. దీనికి సంబంధించిన సమాచారం పూర్తి గోప్యంగా ఉంచబడుతుంది. అందుకే దీనికి ఇంతగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇందులో బుక్ చేసుకునేటప్పుడే ఆమెకు ఎలాంటి లక్షణాలు కలిగిన వారు కావాలో ఆప్షన్లు కేటాయిస్తారు. అందులో వారి ఎత్తు, బరువు, రంగు, పేరు, లుక్, స్టైల్ ఇలా చాలా రకాల పరీక్షలు జరిపి వారిని నియమించుకుంటారు. ఇలాంటి వాటిని కోరుకునేది కేవలం కొంతమంది డబ్బున్న వారే కావడంతో ఇన్ని రకాలా కోరికలను కనబరుస్తున్నారు. తమకు నచ్చినట్లు గడిపితే అదనంగా టిప్స్ రూపంలో కూడా ఇస్తున్నట్లు తెలుస్తుంది. తమకు కావస్సిన అన్ని రకాలా జాగ్రత్తలు తీసుకొని తమతో గడిపేందుకు అబ్బాయిలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఒక్కసారి సర్వీస్ ప్రొవైడ్ చేసిన వారితో మరోసారి కలిసేందుకు వెసులుబాటు లేనివిధంగా యాప్ లో సమాచారం పోందుపరుస్తారు.

గంటకో రేటు- పూటకొకరితో మాటు:
దీనికి సంబంధించి ప్రత్యేక వెబ్ సైట్లను ఏర్పాటు చేసి తద్వారా కాల్ బాయ్స్ ఎక్కడకి వెళ్తున్నాడు. ఎవరితో కలుస్తున్నాడు. ఎంతసేపు గడిపాడు అనే పూర్తి సమాచారాన్ని వాట్సప్ ద్వారా లొకేషన్ ట్రాక్ చేస్తూ నిరంతర పర్యవేక్షణలో ఉంటారు. దీనికి కూడా ఒక ప్రత్యేకమైన ధరలను కేటాయించినట్లు తెలుస్తుంది. గంటకు రూ.8వేలు, రెండు గంటలు కేటాయిస్తే 12 వేలు, ఒక పగలంతా గడిపితే 15 వేలు, అదే రాత్రి మాత్రమే గడిపితే 18 నుంచి 20 వేలు ఇస్తున్నట్లు కాల్ బాయ్స్ చెబుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల వారు నార్త్ ఇండియన్స్ ని ఎక్కవ ఇష్ట పడుతున్నట్లు తెలుస్తుంది. అదే నార్త్ ఇండియన్స్ అయితే తెలుగు అబ్బాయిలను పిలిపించుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో కాల్ బాయ్ గా వెళ్లాలంటే కనీస వయసును నిర్థారించాయి ఈ గూఢాచారి సంస్థలు. కేవలం 19 నుంచి 25 ఏళ్ల వయసు కలిగిన వారికే ఎక్కువ ప్రధాన్యం ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే వీరి వస్త్రాలంకరణ, వేషధారణ పై కూడా కొన్ని నియమాలను పెడుతున్నట్లు తెలిసింది.

ఇలా చేస్తే డిమాండు కొంచెం ఎక్కువ:
మేల్ ఎస్కార్ట్ బాయ్స్ ని ఎంచుకున్న మహిళల వివరాలు ఏవీ ఆమె వద్దకు వెళ్లే అబ్బాయికి తెలియదు. వీరి వివరాలు కూడా ఎస్కార్ట్స్ ఎవరికీ చెప్పరు. అలా ఒకవేళ చెపితే అలాంటి అబ్బాయిలను తిరిగి తమ టీంలో చేర్చుకోరు. అందుకనే ఇందులో పనిచేసే వారు సంస్థను, మహిళ వివరాలను చాలా గోప్యంగా ఉంచుతారు. అలాగే ఇలా మెయింటెన్ చేయడానికి రోజూ ప్రత్యేకమైన ఆహారం తీసుకోవల్సి ఉంటుంది. అలాగే వ్యాయామాలు చేయాల్సి వస్తుంది. మంచి దేహ అందాలతో ఫిట్ గా ఉన్న అబ్బాయిలకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. అలసిపోకుండా ఎక్కువసేపు శక్తిని కలిగి ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇలా వీరిని మెయింటెన్ చేయడానికి నెలకు రూ.25 వరకూ ఖర్చు అవుతుందట. ఇలా తయారు చేసిన వారిని పంపించినందుకు 30శాతం కమిషన్ ను సంస్థవారు మహిళల నుంచి కేటాయిస్తున్నట్లు సమాచారం. మహిళలు తామకు నచ్చినట్లు మాట వింటే వచ్చిన కాల్ బాయ్ కి అదనంగా వేలల్లో టిప్స్ కూడా అందిస్తున్నారట. అందుకే ఇలాంటి వాటికి కొంతమంది యువత మొగ్గు చూపుతున్నారు.

 

 

T.V.SRIKAR