గుండెను రెండుగా చీల్చి.. తల మొండెం వేరు చేసి మీరట్ మ*ర్డర్.. పోస్ట్‌మార్టంలో సంచలనాలు
ఇప్పటి వరకూ భార్యలను చంపి ముక్కలు చేసిన భర్తల కథలు విన్నాం. మగాళ్ల కంటే మేమేం తక్కువ అనుకుందో ఏమో.. ప్రియుడితో కలిసి భర్తను చంపి 15 ముక్కలుగా నరికింది ఓ మహిళ.

ఇప్పటి వరకూ భార్యలను చంపి ముక్కలు చేసిన భర్తల కథలు విన్నాం. మగాళ్ల కంటే మేమేం తక్కువ అనుకుందో ఏమో.. ప్రియుడితో కలిసి భర్తను చంపి 15 ముక్కలుగా నరికింది ఓ మహిళ. అది కూడా నార్మల్‌గా కాదు. గుండెను రెండుగా చీల్చి బాడీ నుంచి తలను వేరు చేసి అత్యంత కిరాతకంగా హత్య చేసింది. మర్డర్ జరిగిన తీరు చూసి పోలీసులే షాక్ అవుతున్నారు. మీరట్‌లో జరిగిన ఈ దారుణం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
లండన్‌లో నేవీ మర్చంట్ ఆఫీసర్‌గా పని చేస్తున్న సౌరభ్.. ముస్కాన్ అనే అమ్మాయిని 2016లో లవ్ మ్యారేజ్ చేసున్నాడు. భార్యతో కలిసి ఉండాలని ఉద్యోగం కూడా మానేసి కొత్త కాపురం ప్రారంభించాడు. కానీ కొన్ని రోజులకే వాళ్లిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దానికి కారణం ముస్కాన్ సాహిల్ శుక్లా అనే అబ్బాయి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసి సౌరభ్ భార్యతో విడాకులు తీసుకోవాలి అనుకున్నాడు. కానీ కూతురుకోసం విడిపోకుండా ఆగాడు. భార్య పద్ధతి మారకపోవడంతో మళ్లీ లండన్ వెళ్లిపోయి ఉద్యోగంలో చేరాడు.
భర్త ఇండియాలో లేకపోవడంతో ముస్కాన్ మరింత రెచ్చిపోయింది. పూర్తిగా భర్తను అడ్డు తొలగించుకోవాలని సాహిల్‌తో కలిసి భర్తను చంపేయాలని నిర్ణయించుకుంది. కూతురి బర్త్ డే కోస రీసెంట్‌గా సౌరభ్ లండన్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చాడు. భర్తను చంపేయాలని నిర్ణయించుకున్న ముస్కాన్ సౌరభ్ తినే ఫుడ్‌లో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కలిపింది. సౌరభ్ నిద్రలోకి జారుకున్న తరువాత లవర్‌తో కలిసి భర్తను మర్డర్ చేసింది. ముక్కలు ముక్కలుగా నరికి వాటిని ఓ ప్లాస్టిక్ డ్రమ్‌లో వేసి ఆ డ్రమ్‌ను సిమెంట్‌తో నింపేసింది. బంధువులు, స్నేహితులను తప్పుదోవ పట్టించడానికి సౌరభ్ ఫోన్ నుంచి వాళ్లకు మెసేజ్‌లు కూడా పెట్టింది.
సౌరభ్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముస్కాన్ మీద అనుమానంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారించారు. దీంతో తానే తన భర్తను చంపినట్టు ఒప్పుకుంది ముస్కాన్. ముస్కాన్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో.. 15 రోజుల తరువాత డ్రమ్ములో సిమెంట్ మధ్య గడ్డకట్టి ఉన్న సౌరభ్ అవశేషాలను పోలీసులు గుర్తించారు. డ్రమ్ములో సిమెంట్‌తో కప్పబడిన శరీరభాగాలను డాక్టర్లు అతి కష్టం మీద బయటకు తీశారు.
సౌరభ్‌ను మర్డర్ చేసిన తీరు చూసి డాక్టర్లు కూడా షాకవుతున్నారు. పోస్ట్ మార్టం చేస్తున్న సమయంలో సౌరభ్ గుండె రెండుగా చీలి ఉండటాన్ని డాక్టర్లు గమనించారు. సౌరభ్ నిద్రలోకి జారుకున్న తరువాత ముస్కాన్ సౌరభ్ గుండెల్లో కత్తితో మూడు సార్లు పొడిచింది. అతి దారుణంగా సౌరభ్ గుండెను చీల్చి పడేసింది. తర్వాత తలను శరీరంనుంచి వేరు చేసింది. శరీరాన్ని ముక్కలుముక్కలుగా కొసి పడేసింది. ముక్కలన్నీ డ్రమ్‌లో పడేసింది. ఆధారాలు దొరకకుండా ఉండేందుకు ఆ డ్రమ్‌ను పూర్తిగా సిమెంట్‌తో నింపేసింది. ముస్కాన్ చేసిన దారుణం తెలిసి డాక్టర్లే షాక్ అయిపోయారు. ఆఖరికి ముస్కాన్ తల్లిదండ్రులు కూడా ఆమెను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.