MLC Shaik Sabjee: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ మృతి.. షాక్‌లో సీఎం..
రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఎమ్మెల్సీ సాబ్జి చనిపోయారు. ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉండి మండలం చెరుకువాడ మెయిన్ రోడ్డు మీద ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ప్రయాణిస్తున్న కారును రెండు వాహనాలు ఢీకొట్టాయి.

MLC Shaik Sabjee: అతివేగం ఓ ప్రజా ప్రతినిధి ప్రాణం తీసింది. రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఎమ్మెల్సీ సాబ్జి చనిపోయారు. ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉండి మండలం చెరుకువాడ మెయిన్ రోడ్డు మీద ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ప్రయాణిస్తున్న కారును రెండు వాహనాలు ఢీకొట్టాయి. దీంతో కంట్రోల్ తప్పిన ఎమ్మెల్సీ వాహనం రోడ్డుపక్కకు వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ అక్కడికక్కడే చనిపోయారు.
Chandoo Sai: చందుగాడు అరెస్ట్.. పెళ్లి చేసుకుంటానని మోసం..
ఆయనతో పాటు కారులో ఉన్న ఆయన పీఏ, గన్‌మెన్, కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. సింగిల్ రోడ్డు కావడంతో ప్రమాదం భారీ స్థాయిలో జరిగినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెప్తున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. సాబ్జీ మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. ప్రమాద సమయంలో సాబ్జీ సీట్‌బెల్ట్ పెట్టుకోలేదని ప్రాథమికంగా నిర్ధారించారు. సీట్‌బెల్ట్ పెట్టుకుని ఉంటే ఈ స్థాయిలో ప్రమాదం జరిగి ఉండేది కాదని పోలీసులు చెప్తున్నారు. ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ అయితే సాబ్జీ చనిపోయేవారు కాదని చెప్తున్నారు. కారును ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొట్టిన వెంటనే సాబ్జీ నేరుగా డాష్‌బోర్డ్‌ను ఢీ కొట్టారు.
దీంతో ఆయన ఛాతిలో బలమైన గాయమైంది. దీంతో అక్కడికక్కడే ఆయన చనిపోయారు. సాబ్జీ మృతిపట్ల ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏపీ కేబినెట్ కూడా సాబ్జీ మృతిపై సంతాపం ప్రకటించింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ ఏపీ కేబినెట్ మంత్రులు 2 నిమిషాలు మౌనం పాటించారు.