మహ్మద్ షమీ రీ ఎంట్రీ, రంజీ బరిలో సీనియర్ పేసర్
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మళ్ళీ గ్రౌండ్ లోకి అడుగుపెడుతున్నాడు. సుమారు ఏడాది తర్వాత మళ్లీ కాంపిటీటివ్ ఆడబోతున్నాడు.
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మళ్ళీ గ్రౌండ్ లోకి అడుగుపెడుతున్నాడు. సుమారు ఏడాది తర్వాత మళ్లీ కాంపిటీటివ్ ఆడబోతున్నాడు. మధ్య ప్రదేశ్ తో జరగబోయే రంజీ ట్రోఫీ మ్యాచ్ లో షమి బరిలోకి దిగనున్నట్లు క్రికెట్ అసిసోయేషన్ ఆఫ్ బెంగాల్ వెల్లడించింది. గతేడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు.
సర్జరీ తర్వాత పూర్తిస్థాయి ఫిట్ నెస్ సాధించేందుకు ఇన్ని రోజులు పట్టింది. గతేడాది వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ అయిన మహ్మద్ షమి గాయం నుంచి కోలుకోవడం టీమిండియాకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నిజానికి న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ కే షమి వస్తాడని భావించినా.. అది సాధ్యం కాలేదు. దీంతో ఆస్ట్రేలియాలో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి షమీని ఎంపిక చేయలేదు. అయితే ఇప్పుడు రంజీ ట్రోఫీ మ్యాచ్ లో షమి రాణిస్తే ఆసీస్ టూర్ కు వెళ్ళే ఛాన్సుంది.