ఆ చీరె ఆమె ప్రాణం తీసింది…!

పది రోజులుగా మృత్యువుతో పోరాడిన ప్రాణం అలసిపోయింది. బాగుండాలని, ఆరోగ్యం బాగుపడి రావాలని సన్నిహితులు, స్నేహితులు చూసిన ఎదురుచూపు కన్నీరే మిగిల్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 4, 2025 | 04:00 PMLast Updated on: Apr 04, 2025 | 4:00 PM

Naganajali Death Mystary

పది రోజులుగా మృత్యువుతో పోరాడిన ప్రాణం అలసిపోయింది. బాగుండాలని, ఆరోగ్యం బాగుపడి రావాలని సన్నిహితులు, స్నేహితులు చూసిన ఎదురుచూపు కన్నీరే మిగిల్చింది. రాజమండ్రి మెడికల్ విద్యార్థిని చనిపోయింది. కామాంధుడి వేధింపులు తాళలేక.. చావు తప్ప వేరే మార్గం కనిపించక.. కిమ్స్ ఆసుపత్రిలో సూసైడ్ అట్టెంప్ట్ చేసి.. పది రోజులుగా ప్రాణాలతో పోరాడిన నాగాంజలి చనిపోయింది. ఈ ఘటనపై న్యాయం చేయాలని.. ఆమె పరిస్థితికి కారణం అయినా దీపక్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. నాగాంజలి మరణంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.. కిమ్స్ ఆసుపత్రి దగ్గర ఎటువంటి అల్లర్లు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాగాంజలి ఆత్మహత్య ఘటన వెనక సంచలన నిజాలు బయటకు వచ్చాయి.

ఏలూరు జిల్లాకు చెందిన నాగాంజలి.. రాజమండ్రిలో ఫార్మసి చేస్తోంది. కుటుంబ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో.. ఓ ఆసుపత్రిలో పార్ట్ టైం జాబ్ చేస్తోంది. అయితే ఆమె అందమే ఆమెకు శాపంగా మారింది.. ఆమె కట్టుకున్న ఎర్ర రంగు చీరనే ఉరితాడు అయింది. నగరంలో జరిగిన ఓ ఫంక్షన్ కు ఎర్ర చీర కట్టుకుని నాగాంజలి వెళ్లింది.. అయితే అదే ఫంక్షన్లో దీపక్ పరిచయం అయ్యాడు.. ఎర్ర చీరలో అందంగా ఉన్నావంటూ నాగంజలి కి దగ్గరయ్యాడు.. ప్రేమ పేరుతో వల విసిరాడు.. శారీరకంగా వాడుకున్నాడు.. ఆ తర్వాత దూరం పెట్టాడు.. ఎందుకు అని ప్రశ్నిస్తే.. బెదిరింపులకు దిగడం మొదలు పెట్టాడు.

నాగాంజలి తో సన్నిహితంగా మెదిలిన ఫోటోలను బయట పెడతా అని భయపెట్టాడు.. ఆమెను మెంటల్ గా టార్చర్ చేశాడు.. ఇవన్నీ భరించలేక ప్రాణం తీసుకుంది నాగంజలి ఆమె డైరీలో రాసుకున్న లేఖ సంచలనంగా మారింది. ఎర్ర చీర కట్టుకోవడమే పాపం అయిపోయిందని.. l ఆ రోజు నిజంగా ఆ ఎర్ర చీర కట్టుకుని ఉండకపోతే.. ఆ నీచుడి కంటిలో పడి ఉండేదాన్ని కాదేమో.. ఈ రోజు ఇలాంటి పరిస్థితి l ఉండేది కాదేమో అంటూ.. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు… అమ్మానాన్నకు.. నాగాంజలి రాసిన లేఖ ప్రతి ఒక్కరితో కన్నీళ్ళు పెట్టిస్తోంది..విద్యార్థిని అంతలా టార్చర్ చేసి.. ప్రాణాలు పోవడానికి కారణం అయినా వాడిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వినిపిస్తున్నాయి…