Lahari Father: మా అల్లుడు బంగారం.. లహరి తండ్రి షాకింగ్ కామెంట్స్..
నల్గొండ జిల్లా లహరి మృతి కేసులో పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. భర్త వల్లభ్ లహరిని హత్య చేశాడు అని పోలీసులు తేల్చినప్పటికీ లహరి తండ్రి జైపాల్ రెడ్డి మాత్రం తన అల్లుడు నిరపరాది అంటున్నాడు.

New things have come to light in Lahari murder mystery between Vallabh and Lahari couple
లహరి శరీరం మీద గాయాలు ఉన్నాయి, ఆమె కడుపులో రక్తం గడ్డకట్టింది అని పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో చాలా క్లియర్‌గా ఉంది. ఎవరో ఆమెను తీవ్రంగా కొట్టి చిత్ర హింసలు పెట్టారు అని పోలీసులు చెప్తున్నారు. లహరితో వల్లభ్ మాత్రమే ఉన్నాడు కాబట్టి అతనే హత్య చేసి ఉంటాడని కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఆధారంగానే వల్లభ్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ పోలీసులు వల్లభ్ మీద తప్పుడు కేసు పెట్టారంటున్నారు లహరి తండ్రి జైపాల్ రెడ్డి. హార్ట్‌ఎటాక్ వచ్చిన టైంలో కిందపడటం కారణంగా లహరి తలకు గాయమైందంటున్నాడు.
తమ అల్లుడు లహరిని చాలా ప్రేమగా చూసుకునేవాడని.. అలాంటి వాడు భార్యను ఎందుకు హత్య చేస్తాడు అంటూ రివర్స్‌లో క్వశ్చన్ చేస్తున్నారు. లహరి కడుపులో రక్తం గడ్డకట్టడానికి వేరే కారణాలు ఉండొచ్చ అంటూ అంతా షాకయ్యేలా మాట్లాడుతున్నాడు. వేరే డాక్టర్ సలహా తీసుకున్న తరువాత పోలీసులు వల్లభ్ మీద పెట్టిన కేసును కోర్టులో చాలెంజ్ చేస్తామని నవ్వుకుంటూ చెప్తున్నాడు. అటు వల్లభ్ తండ్రి కూడా ఇదే విషయం చెప్తున్నాడు. కావాలనే తన కొడుకుపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారంటూ చెప్తున్నాడు. న్యాయస్థానంలో అన్ని నిజాలు బయటపెడతామంటూ చెప్తున్నాడు. వల్లభ్ తండ్రి ఇలా మాట్లాడితే ఓకే .. కానీ లహరిని హత్య చేశారు అని తెలిసిన తరువాత కూడా ఆమె తల్లిదండ్రులు ఇంత కూల్‌గా అల్లుడికి సపోర్ట్ చేయడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఎవరో వీళ్లను భయపెట్టి ఇలా మాట్లాడిపిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.